- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది..
ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్(Akash) హీరోగా, భైరవి అర్థ్యా(Bhairavi Ardhya) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ‘కొత్త మలుపు’(kotha malupu).

దిశ, సినిమా: ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్(Akash) హీరోగా, భైరవి అర్థ్యా(Bhairavi Ardhya) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ‘కొత్త మలుపు’(kotha malupu). తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో, ఈ సినిమాలో సీనియర్ నటులు రఘు బాబు, పృద్వి, ప్రభావతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ విడుదలైంది. గ్రామీణ నేపథ్యంతో, ప్రేమ-సస్పెన్స్-కామెడీ మేళవింపుతో రూపొందుతున్న ‘కొత్త మలుపు’ ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్నాం. గ్రామీణ వాతావరణంలో సాగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు.






