నక్సలిజాన్ని అణిచివేయడం సాధ్యం కాదు.. సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుశ్చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించాలని సీపీఐ నేత నారాయణ (CPI Narayana) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నక్సలిజాన్ని అణిచివేయడం సాధ్యం కాదు.. సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వెనెజువెలా (Venezuela)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దుశ్చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించాలని సీపీఐ నేత నారాయణ (CPI Narayana) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ సర్కార్ అర్థం లేని విదేశాంగ విధానాల వల్ల దేశంలో రాజ్యాంగ సంక్షోభం వస్తుందని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై యుద్ధం ప్రకటించిందని అన్నారు. కానీ, నక్సలిజాన్ని అణిచివేయడం సాధ్యం కాదని కామెంట్ చేశారు. దండకారణ్యాల్లో విచ్చలవిడిగా బూటకపు ఎన్‌కౌంటర్లకు తెగబడుతూ.. అక్కడున్న విలువైన ఖనిజ సంపదను దోచుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే దగ్గర కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సీపీఐ నారాయణ సలహా ఇచ్చారు.

Next Story