చంద్రుడి మట్టిని భూమికి తెచ్చేందుకు ఇస్రో మాస్టర్ ప్లాన్.. చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఖరారు

by Malleboina Mahesh |

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 ప్రయోగం విజయం భారత దేశానికి ఎంతో పెరును సంపాదించి పెట్టిన విషయం తెలిసిందే.

చంద్రుడి మట్టిని భూమికి తెచ్చేందుకు ఇస్రో మాస్టర్ ప్లాన్.. చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 ప్రయోగం (Chandrayaan-3 launch) విజయం భారత దేశానికి ఎంతో పెరును సంపాదించి పెట్టిన విషయం తెలిసిందే. ఈ భారీ ప్రయోగం 2023, జూలై 14న మధ్యాహ్నం 2:35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC SHAR) నుండి LVM3-M4 రాకెట్ ద్వారా ఈ నౌకను నింగిలోకి పంపారు. దాదాపు 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత, ఆగస్టు 23, 2023 న సాయంత్రం 6:04 గంటలకు చంద్రయాన్-3 ల్యాండర్ (విక్రమ్) చంద్రుడి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా అడుగుపెట్టింది. ఈ అద్భుత విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను విజయవంతంగా దించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది.

కాగా ఈ భారీ విజయం తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధం అయింది. చంద్రుడి మట్టిని భూమికి తెచ్చేందుకు ఇస్రో మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా.. క్లిష్టమైన 'చంద్రయాన్-4' మిషన్‌ ('Chandrayaan-4' mission)పై దృష్టి పెట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించిన అత్యంత కీలకమైన అడుగు పడింది. చంద్రుడిపై ల్యాండర్ ఎక్కడ దిగాలో ఆ ప్రాంతాన్ని (Landing Site) శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

'చంద్రయాన్-4' ఎక్కడ దిగుతుందంటే..?

చంద్రయాన్-3 మాదిరిగానే, ఈసారి కూడా ఇస్రో చంద్రుడి దక్షిణ ధ్రువానికే (South Pole) ప్రాధాన్యత ఇచ్చింది. అయితే, ఈసారి ఎంచుకున్న ప్రాంతం మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. శాస్త్రవేత్తలు ఇప్పటికే ఆ ప్రాంతంలోని ఉపరితలం, వెలుతురు, మట్టి స్వభావాన్ని విశ్లేషించి ల్యాండింగ్ సైట్‌ను ప్రాథమికంగా ఖరారు చేశారు.

ఏమిటి 'శాంపిల్ రిటర్న్' మిషన్..

చంద్రయాన్-4 గత ప్రయోగాల కంటే పూర్తిగా భిన్నమైనది. దీనిని 'లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్' అని పిలుస్తారు. దీనికి.. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా దిగడం. అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను (Samples) సేకరించడం. చంద్రుడి ఉపరితలం నుండి మళ్లీ రాకెట్‌ను ప్రయోగించడం, రోవార్ సేకరించిన నమూనాలను సురక్షితంగా భూమికి తీసుకురావడం వంటి కీలక సవాళ్లను ఇస్రో అధిగమించాల్సి ఉంది.

ఎందుకు ఇది అంత క్లిష్టమైనది

ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ చెప్పినట్లుగా.. ఇది భారత్ చేపట్టబోయే అత్యంత సంక్లిష్టమైన ప్రాజెక్ట్. ఒకే ప్రయోగంలో రెండు రాకెట్లను (LVM3 మరియు PSLV వంటివి) ఉపయోగించే అవకాశం ఉంది. చంద్రుడిపై దిగడం ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి మళ్లీ భూమికి తిరిగి రావడం అనేది సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ మిషన్‌కు ఆమోద ముద్ర వేసింది. ఇస్రో ప్రణాళిక ప్రకారం 2028 నాటికి చంద్రయాన్-4 అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది.

Next Story