Turmeric: మీరు వాడే పసుపు స్వచ్ఛమైనదా? కాదా? ఈ విధంగా తెలుసుకోండి?

by Anjali |   ( Updated:2025-02-09 15:07:21.0  )
Turmeric: మీరు వాడే పసుపు స్వచ్ఛమైనదా? కాదా? ఈ విధంగా తెలుసుకోండి?
X

దిశ, వెబ్‌డెస్క్: పసుపు(Turmeric)కు ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. పసుపును ఆయుర్వేదం(Ayurveda)లో ఉపయోగిస్తారు. పసుపులో యాంటీ బాక్టీరియల్(Antibacterial), యాంటీ ఇన్ఫ్లమేటరీ(Anti-inflammatory), యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant) లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు ఉపయోగాలు చూసినట్లైతే.. పసుపు నీరు(Yellow water) తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా.. పసుపు కలిపిన కొత్తిమీర(Coriander) ఆకుల రసాన్ని ముఖానికి మాస్క్‌గా పట్టడం వల్ల పింపుల్స్(Pimples), మచ్చలు(Spots) తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

పసుపుతో అవిసే పూలు కలిపి రసం తీసి వాడటం వల్ల కండ్ల కలకకు ఉపశమనం లభిస్తుంది. వీటితో పాటుగా పసుపు, వేపాకు కలిపి వాటర్‌లో మరిగించి కాళ్లకు, చేతులకు రాయడం వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయని.. పసుపు క్యాన్సర్‌‌ను అడ్డుకోవడంలో తోడ్పడుతుంది. పసుపు కొలెస్ట్రాల్‌(Cholesterol)ను తగ్గించడంలో, పసుపు రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచుతుందని మేలు చేస్తుంది. పసుపుతో కాలేయానికి రక్ష(Protects the liver), ప్రథమ చికిత్స(first aid), జీర్ణకోశ సమస్యల(Gastrointestinal problems)కు, శ్వాసకోశ సమస్యల(Respiratory problems)కు, అల్జీమర్స్ వ్యాధి(Alzheimer's disease) నివారణకు పసుపు ఎంతో మేలు చేస్తుంది.

ప్రతి ఒక్క భారతీయులు వంటకాల్లో పసుపు వాడుతారన్న విషయం తెలిసిందే. వంటకాల్లో వాడే ఈ పసుపును చాలా మంది మార్కెట్‌లో కొంటుంటారు. ఈ పసుపు తెచ్చి ఆహార పదార్థాల తయారీతో వాడుతుంటారు. అయితే మీరు వాడే పసుపు స్వచ్ఛమైనదా? కాదా? అని తెలుసుకోవడం ఎలాగో తాజాగా నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

పసుపులో కొన్ని చుక్కల అయోడిన్(Iodine) కలిపండి. తర్వాత పసుపు నీలం కలర్‌లోకి ఛేంజ్ అయితే అది కల్తీ పసుపు అని గుర్తించండని నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే కొంచెం పసుపును మంట మీద వేయండి. తర్వాత ఒక పాత్రను మంటపై పెట్టండి. అది కల్తీ పసుపు అయితే.. ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.

Next Story

Most Viewed