- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వీరేశం వర్గం పై.. చిరుమర్తి వర్గం అక్రమ కేసులు..?

దిశ, రామన్నపేట: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇంద్రపాలనగరం ఎంపీటీసీ పూస బాలమణి బాల నర్సయ్య ఆదివారం ఒక ప్రకటనలో అన్నారు. టిఆర్ఎస్ పార్టీ లో ఉద్యమ కాలం నుండి పనిచేస్తున్న కార్యకర్తలపై కావాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనుచరులు అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
నిదాన పెళ్లి గుట్టపై జరిగిన ఘర్షణలో కార్యకర్తల ప్రమేయం లేకున్నా కావాలని కేసులలో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలకు ఇబ్బందులు సృష్టిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కార్యకర్తల కష్టసుఖాలలో వెన్నంటి ఉండే వేముల వీరేశం నాయకత్వంలోనే మేము కొనసాగుతామని బెదిరింపులకు లొంగేది లేదని అన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.