- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఉపాధ్యాయుడే ప్రైవేట్ పీఆర్వోగా చలామణి?
ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థకు అనధికారికంగా ప్రజా సంబంధాల అధికారిగా(పీఆర్వో) వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

దిశ,సూర్యాపేట: ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థకు అనధికారికంగా ప్రజా సంబంధాల అధికారిగా(పీఆర్వో) వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు, ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు పక్కనపెట్టి కార్పొరేట్ పాఠశాలలకు అడ్మిషన్లు తీసుకరావడం పై దృష్టి పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట మండల పరిధిలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు, పదో తరగతి, ఇతర ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారి కుటుంబాలను సంప్రదిస్తూ డబ్బులు ఎర చూపి ర్యాంకులు వెలువడిన రోజే విద్యార్థుల ఇళ్లకు చేరుకుని, కార్పొరేట్ పాఠశాలల్లో చేరితే ఒక్కో అడ్మిషన్‌కు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ప్రోత్సాహకాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీలు ఇస్తూ కార్పొరేట్ సంస్థలో విద్యార్థుల ను చెరిపిస్తున్నడని విమర్శలు గుప్పుమంటున్నాయి.
ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలే టార్గెట్..
ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలను కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పించేందుకు ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వెలువడిన 10 వ తరగతి పరీక్ష ఫలితల లో ఓ డాక్టర్ కూతురు కి టాప్ ర్యాంక్ రావడం తో ఆ విషయం తెలుసుకున్న ఈ ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ ఇంటి చుట్టూ ప్రతి రోజు తిరుగుతూ కార్పొరేట్ కాలేజీలో చేర్పించాలని వాళ్లని ఇబ్బంది పెట్టిన దాఖలలు ఇప్పుడు ఈ నోట ఆ నోట పడి బయటకు పొక్కింది. హైటెక్ బస్ స్టాండ్ వెనుక ఉన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వాళ్ల తనయుడు ఏ ఎస్ రావు పరీక్ష ఫలితాల్లో అత్యధిక ర్యాంక్ రావడం తో ఆ విద్యార్ధి తల్లిదండ్రులకు రూ.5 లక్షలు ఆఫర్ చేసి సూర్యాపేట పాఠశాలలో కాకుండా కార్పొరేట్ పాఠశాలకు పంపించడం గమనర్హం. ఈ విధంగా అడ్మిషన్లు పెంచి భారీ మొత్తంలో కమిషన్లు పొందుతూ కోట్ల రూపాయలకు ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పడగేత్తాడనీ స్థానికంగా చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ సేవలో ఉండి ప్రైవేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా..
ప్రభుత్వ సేవలో ఉండి ప్రైవేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా వ్యవహరించడం సేవా నియమావళికి విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత విద్యాశాఖ అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. పదో తరగతి, ఇంటర్, ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను సేకరించి వారినే లక్ష్యంగా చేసుకొని ఫలితాలు వెలువడిన రోజే ఉదయం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కార్పొరేట్ పాఠశాలలు, కాలేజీల్లో చేరాలని తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పు మంటున్నాయి.ఒక్కో అడ్మిషన్‌కు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు కమిషన్ లేదా ప్రోత్సాహకం ఇస్తామని ,ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలను, ర్యాంక్ లు వచ్చిన విద్యార్థులను కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పించేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే ప్రైవేట్ సంస్థల కోసం పనిచేయడం సేవా నియమావళికి విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా నాణ్యత పెంచాల్సిన ఉపాధ్యాయులు కార్పొరేట్ అడ్మిషన్లపై ఎక్కువ దృష్టి పెట్టడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ల ద్వారా భారీ మొత్తంలో ఆదాయం సంపాదిస్తు కోట్లకు పడగెత్తాడని జిల్లా ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కార్పొరేట్ పాఠశాల కళాశాలలకు కొమ్ముకాస్తున్న టీచర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
మా దృష్టికి రాలేదు: డీఈఓ అశోక్
ప్రభుత్వ టీచర్ గా విధులు నిర్వహిస్తూ ప్రైవేటు పాఠశాలలకు కార్పొరేట్ పాఠశాలలకు కమిషన్ కోసం కక్కుర్తి పడి అడ్మిషన్ పంపిస్తూన్నరన్న విషయం మా దృష్టికి రాలేదని డీఈవో అశోక్ తెలిపారు. అలా ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ప్రైవేటు పాఠశాలలకు కొమ్ముకాస్తున్నారన్న విషయం మా దృష్టికి వస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఫిర్యాదు చేసిన ఫిర్యాదు అందిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు చేసిన వారి సమాచారo గోప్యంగా ఉంచుతామని తెలిపారు.






