- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ నేరగాళ్ల పై ఉక్కుపాదం: బ్యాంకర్లతో సైబరాబాద్ సీపీ కీలక భేటీ
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ బ్యాంకర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాల్లో పోగొట్టుకున్న రూ.104 కోట్లను వెనక్కి తెచ్చేందుకు, భవిష్యత్తులో మోసాలను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న సైబర్ నేరాల (Cyber crimes)ను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, IPS బ్యాంకర్లతో కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు సైబర్ మోసాల వల్ల సుమారు రూ.104 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టబడటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల నుండి ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి, వారి నగదును రక్షించేలా బ్యాంకులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా నేరగాళ్లు ఉపయోగించే 'మ్యూల్ అకౌంట్లపై (Mule Accounts) నిఘా ఉంచి, అనుమానాస్పద ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు.
సైబర్ దాడులకు గురైన బాధితులకు వేగంగా న్యాయం చేసేందుకు బ్యాంకుల్లో 24/7 ప్రత్యేక సైబర్ సెల్స్ ఏర్పాటు చేయాలని కమిషనర్ ప్రతిపాదించారు. నేర విచారణలో భాగంగా పోలీసులకు అవసరమైన కేవైసీ (KYC), లావాదేవీల డేటాను ఎటువంటి జాప్యం లేకుండా అందించాలని కోరారు. తద్వారా మోసపూరిత లావాదేవీలను నిలిపివేసి (Freeze), నగదును రికవరీ చేసే ప్రక్రియ సులభతరమవుతుందని ఆయన వివరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, నమ్మశక్యం కాని పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని.. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






