- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : అమెరికాను ఇరాన్ మరోసారి హెచ్చరించింది. ఇరాన్ పై దాడికి దిగితే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ పై అమెరికా దాడికి దిగితే అది రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదని, అది భీకరమైన ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని అన్నారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ తమపై దాడి జరిగితే మాత్రం గట్టిగా సమాధానం ఇస్తామని ఖమేనీ స్పష్టం చేశారు. అణు ఒప్పందంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మిడిల్ ఈస్ట్ దేశాల్లో సంచలనం రేపుతున్నాయి. కాగా అంతకుముందు అణు ఒప్పందానికి రాకపోతే తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ను హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ లీడర్ పై వ్యాఖ్యలు చేసింది.
Next Story






