ట్రంప్ నేరస్థుడు: ఇరాన్ సుప్రీం

by Gantepaka Srikanth |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ నేరస్థుడు: ఇరాన్ సుప్రీం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ(Iran Supreme Leader Khamenei) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో ఆందోళనలు, ప్రాణ నష్టానికి ట్రంపే కారణమని ఆరోపించారు. ఇరాన్‌లో నిరసనలకు మద్దతిచ్చిన ట్రంప్ నేరస్థుడు కాక ఇంకేమవుతాడని ప్రశ్నించారు. నిరసనల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌పై ఆధిపత్యం చేలాయించడం కోసమే ట్రంప్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. నిరసనల్లో పాల్గొన్న వారంతా అమెరికా కోసం పనిచేస్తున్న వారే. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారు. ఇరాన్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టం.. అందరికీ అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించారు. నేను నా దేశాన్ని యుద్దం వైపు నడిపించడం లేదు. వీలైనంత మేరకు పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాను అని ప్రకటన చేశారు.

Next Story