తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు.. భారత్ మద్దతు కోరిన ఇరాన్

by Muthe.Rajitha |

ఇరాన్‌లో రోజురోజుకు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్న సంగతి తెలిసిందే.

తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు.. భారత్ మద్దతు కోరిన ఇరాన్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్‌లో రోజురోజుకు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి తనకు ఫోన్‌ చేసినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఇరాన్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ఇద్దరం చర్చించామని పేర్కొన్నారు. ఇరాన్‌లో హింసాత్మక ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయుల భద్రతపై భారత్‌ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాల మధ్య ఈ ఇద్దరు మంత్రుల మధ్య చర్చ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఇరాన్ లోని భారత పౌరులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాలను ఉపయోగించి వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్లాలని అక్కడి భారత రాయబార కార్యాలయం సూచించింది. మరోవైపు భారత విదేశాంగ శాఖ కూడా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎవరూ ఇరాన్‌కు ప్రయాణించవద్దని స్పష్టంగా హెచ్చరించింది.

Next Story