- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : హార్మూజ్ రీ ఓపెన్ కు ఇరాన్ గ్రీన్ సిగ్నల్
అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ నేపథ్యంలో రెండు వారాలపాటు హార్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్టు ఇరాన్ కీలక ప్రకటన చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్(Siege Fire) జరిగినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్(Iran) కీలక ప్రకటన చేసింది. రానున్న రెండు వారాలపాటు హార్మూజ్ జలసంధి(Strait Of Hormuz)ని తెరుస్తున్నట్టు ఇరాన్ మినిస్టర్ అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ధ్రువీకరించబడింది. సాంకేతిక పరిమితులను పరిగణలోకి తీసుకుంటూ.. ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్ తో కాల్పుల విరమణ అమలులో ఉండనున్న 14 రోజులు హార్మూజ్ జలసంధిని రీఓపెన్ చేస్తునట్టు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ తమపై దాడులు నిలిపివేస్తే తమ ఆర్మీ కూడా దాడులు నిలిపివేస్తుందని అన్నారు. ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా అంగీకరించిందని తెలియజేసారు. మరోవైపు పాకిస్తాన్ వినతితో ఇరాన్ గడువును 14 రోజులు పొడిగిస్తూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటించారు. ఇరాన్ ప్రతిపాదనలకు అమెరికా సుముఖంగా ఉన్నట్టు సమాచారం.






