- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాకు వరుస షాకులు.. 'A - 10 వార్ థాగ్'ను ధ్వంసం చేసిన ఇరాన్
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో అమెరికా వైమానిక దళానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో అమెరికా వైమానిక దళానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ సైన్యం, అమెరికా మీడియా వివరాల ప్రకారం.. పర్షియన్ గల్ఫ్‌లోని వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన A-10 థండర్‌బోల్ట్ II (Warthog) యుద్ధ విమానాన్ని తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా కూల్చివేశాయని ప్రకటించాయి. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించడంలో ఆరితేరిన ఈ 'వార్తాగ్' జెట్, ఇరాన్ క్షిపణి దాడులకు గురై నేరుగా సముద్రంలో కుప్పకూలిపోయింది. అయితే, విమానం కూలిపోయే ముందే పైలట్ సురక్షితంగా ఎజెక్ట్ అయినట్టు సమాచారం.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇదే రోజున మరో శక్తివంతమైన యుద్ధ విమానం F-15E స్ట్రైక్ ఈగిల్‌ను కూడా ఇరాన్ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. కేవలం 24 గంటల వ్యవధిలో రెండు కీలక యుద్ధ విమానాలను కోల్పోవడం అమెరికా సైనిక వ్యూహాలకు సవాలుగా మారింది. ఇరాన్ మీడియా ఈ పరిణామాలను తమ వైమానిక రక్షణ వ్యవస్థల అద్భుత విజయంగా అభివర్ణిస్తోంది.






