- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా ట్యాంకరుపై ఇరాన్ దాడి
శ్రీలంక సమీపంలో తమ నౌకపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ అమెరికా ట్యాంకరును ధ్వంసం చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. కాగా మార్చి 5న ఇరాన్ స్టేట్ మీడియా (Fars) వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉత్తర పర్షియన్ గల్ఫ్‌లో అమెరికాకు చెందిన ఒక భారీ ఆయిల్ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) దాడి చేశాయి. ఈ దాడితో సదరు ట్యాంకర్ భారీగా మంటల్లో చిక్కుకొని, నౌకకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఇరాన్ ప్రకటించింది. ఇది అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' కి వ్యతిరేక దాడిగా ఇరాన్ అభివర్ణించింది. కాగా బుధవారం శ్రీలంక సమీపంలో అమెరికా సబ్ మెరైన్ దాడిలో ఇరాన్ యుద్ధనౌక 'IRIS Dena' మునిగిపోవడం, అందులో 100 మందికి పైగా సిబ్బంది మరణించడం ఇరాన్‌ను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది. దీనికి సమాధానంగానే ఈరోజు పర్షియన్ గల్ఫ్ లో ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ ఘటన అంతర్జాతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది.
మరోవైపు కువైట్ తీరానికి సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు బ్రిటీష్ మారిటైమ్ ఏజెన్సీ (UKMTO) కూడా ధృవీకరించింది. నౌకలో ప్రాణనష్టంపై భిన్నమైన నివేదికలు వస్తున్నాయి. అయితే ఇరాన్ మీడియా నౌక కాలిపోతోందని చెప్తుంటే, పాశ్చాత్య వర్గాలు మాత్రం నౌక నుండి చమురు లీక్ అవుతోందని, పరిస్థితిని అంచనా వేస్తున్నామని పేర్కొంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఈ దాడి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఏర్పడింది. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రాత్రికి రాత్రే ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన ఐదవ నౌకాదళాన్ని(5th Fleet) అప్రమత్తం చేయడంతో, ఈ ప్రాంతం యుద్ధ క్షేత్రంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.






