ఐపీఎల్ 2026: ఆకాష్ దీప్ స్థానంలో కేకేఆర్ జట్టులోకి సౌరభ్ దూబే

by Malleboina Mahesh |

గాయపడిన ఆకాష్ దీప్ స్థానంలో విదర్భ పేసర్ సౌరభ్ దూబేను తీసుకోనున్న కేకేఆర్. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం.

ఐపీఎల్ 2026: ఆకాష్ దీప్ స్థానంలో కేకేఆర్ జట్టులోకి సౌరభ్ దూబే
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే అనేక జట్లకు ఊహించని షాక్ తగులుతోంది. పలువురు ప్లేయర్లు గాయాల కారణంగా జట్టుకు దూరం అవుతుండగా పలువురు విదేశీ ప్లేయర్లు NOC లభించకపోవడంతో ఈ సీజన్ కు అందుబాటులోకి రావడం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు సైతం కీలక ప్లేయర్ దూరం అయ్యాడు. దీంతో ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందే KKR జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా పేసర్ ఆకాష్ దీప్ స్థానంలో, విదర్భ కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సౌరభ్ దూబేను తీసుకోవాలని కేకేఆర్ యాజమాన్యం నిర్ణయించింది.

28 ఏళ్ల సౌరభ్ దూబే గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ప్రస్తుతం కేకేఆర్ క్యాంప్‌లో చేరుతున్న ఆయనపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ మార్పుకు సంబంధించి కేకేఆర్ ఫ్రాంచైజీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Next Story