IPL లో కరోనా ఎఫెక్ట్.. మ్యాచ్ వేదిక మార్పు

by Vinod kumar |   (  Updated:2022-04-19 12:04:05  IST  )

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కరోనా - IPL 2022: Delhi Capitals vs Punjab Kings venue changed over COVID-19 positive cases

IPL లో కరోనా ఎఫెక్ట్.. మ్యాచ్ వేదిక మార్పు
X

దిశ, వెబ్‌డెస్క్: IPL| ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals) జట్టులో కరోనా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో.. రేపు (ఏప్రిల్‌ 20) పంజాబ్‌ కింగ్స్‌తో(Punjab Kings) జరుగబోయే మ్యాచ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వెలువడింది. ఈ మ్యాచ్ వేదికను మార్చబడినట్లు డీసీ యాజమాన్యం కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. మ్యాచ్‌ వేదిక పూణే నుంచి ముంబైకి మార్చబడినట్లు తెలిపింది. ఈ మ్యాచ్‌కు ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్టు ట్విటర్‌లో పేర్కొంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కరోనా బారినపడిన వారి పేర్లను వెల్లడించింది.. ప్యాట్రిక్ ఫర్హార్ట్ (ఫిజియో), మిచెల్ మార్ష్ (ప్లేయర్‌), చేతన్ కుమార్ (స్పోర్ట్స్ మసాజ్‌ థెరపిస్ట్), డాక్టర్ అభిజిత్ సాల్వి (టీమ్ డాక్టర్), ఆకాష్ మానే (సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్)లకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. వీరిలో మిచెల్‌ మార్ష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఫర్హార్ట్ ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొంది.


Next Story