ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం

by Batti.Sumithra |

మండలంలో కొత్తగా మంజూరైన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో బోధనను నిర్వహించుటకు ఖాళీగా ఉన్న 4-ఇన్స్ ట్రక్టర్, 4-ఆయా పోస్టులకు స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి మంగళవారం తెలిపారు.

ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, చిట్యాల : మండలంలో కొత్తగా మంజూరైన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో బోధనను నిర్వహించుటకు ఖాళీగా ఉన్న 4-ఇన్స్ ట్రక్టర్, 4-ఆయా పోస్టులకు స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి మంగళవారం తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరంనకు 10 నెలల తాత్కాలిక ప్రాతిపాదికన ఎంపీపీఎస్ చిట్యాల, ఎంపీపీఎస్ జూకల్, ఎంపీపీఎస్ చల్లగరిగ, ఎంపీపీఎస్ భీష్మనగర్ పాఠశాలలో ఇన్స్ ట్రక్టర్, ఆయా పోస్టులకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 19, సా. 4 గంటల వరకు మండల కేంద్రంలోని ఎమ్మార్సీ (ఎంఈఓ) కార్యాలయంలో దరఖాస్తు ఫారంతో పాటు స్థానికత, విద్యార్హత దృవపత్రాల జిరాక్స్ , పాస్ ఫోటోను జతపరచి అందజేయాలని పేర్కొన్నారు.

ఇన్స్ట్రక్టర్ కు నెలకు రూ.8000 గౌరవ వేతనం అందిస్తారు. ఈ పోస్టుకు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి, ప్రీ ప్రైమరీ డిప్లమా లేదా ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఆయా పోస్టుకు నెలకు రూ.6000 గౌరవవేతనం అందిస్తారు. ఈ పోస్టుకు ఏడో తరగతి ఉత్తీర్ణులైన మార్కుల జాబితా పత్రమును జత చేయాలి. పై పోస్టులకు 18 సం. నుండి 44 సం.ల లోపు వయసు గల అభ్యర్థులు అర్హులు. స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఉండనున్నట్లు ఎంఈఓ తెలిపారు.

Next Story