- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.లక్ష కోట్లతో RMZ సంస్థ ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అగ్రపథంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను పారిశ్రామికంగా అగ్రపథంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్ (Davos)లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో భాగంగా ఏపీకి మరో భారీ పెట్టుబడి ఖరారైంది. ప్రముఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ RMZ గ్రూప్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)తో దావోస్‌లో జరిగిన భేటీలో RMZ సంస్థ ప్రతినిధులు తమ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ.లక్ష కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు RMZ సంస్థ ప్రతినిధులను వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా ఎదిగేందుకు ఉన్న సానుకూల వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మెగా ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో సుమారు లక్ష మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఐటీ పార్కులు, మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ కల్పన జరగనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసి పనులు ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది.






