- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నదాతకు పెట్టుబడి గండం.. కౌలు రైతులకు పూర్తి నిరాశ!
గ్రామాల్లో వెళ్లి ఎవరిని అడిగిన అన్నదాత అప్పుల బాధనే చెబుతారు.

దిశ, ఎల్కతుర్తి: గ్రామాల్లో వెళ్లి ఎవరిని అడిగిన అన్నదాత అప్పుల బాధనే చెబుతారు. ఈ ఖరీఫ్(వర్షాకాలం) సీజన్‌లో సరైన వర్షాలు రాక, నార్లు పోసి పొలం దున్నడానికి వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఎకర సాగుకు తడిసి మోపెడు అవుతున్న ఖర్చు, పత్తి పంటకు ఎకరాకు 44 వేల రూపాయలు, వరి పంటకు ఎకరాకు రూ.33000 ఖర్చు వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల డీజిల్ ధరలు పెరగడంతో, ట్రాక్టర్ కిరాయి పెరిగింది. రసాయన ఎరువుల ధరలు కంపెనీల మీద ఆధారపడి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. వ్యవసాయ కూలీల కొరత సైతం ఎదుర్కొంటున్నారు. ఉపాధి కూలికి వెళ్తే రోజుకు 70 రూపాయల నుండి రూ.300 వరకు గిట్టుబాటు అవుతుంది. అదే రైతుకు వ్యవసాయ పని చేయడానికి వస్తే రోజుకు 1000 రూపాయలు చెల్లించాలి.
ఏదేమైనా రైతులు వ్యవసాయం చేయక తప్పని పరిస్థితి. కౌలు రైతుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఎకరాకు 15 వేల నుండి 25 వేల వరకు భూ యజమానికి ఇవ్వాలి. ఇది కాక పెట్టుబడి తప్పనిసరి. పేరుకే తెల్ల బంగారం మొత్తం నష్టాల మాటే, ఒకప్పుడు రైతులకు పత్తి పంట బాగా ఆదుకునేది, ప్రస్తుతం గింజలు నాటి నుండి పత్తి చేతికొచ్చే వరకు రోగాలు సోకి రసాయన మందులు ఇబ్బడి ముబ్బడిగా పిచికారి చేయవలసి వస్తుంది. ఎకరాకు సుమారుగా 44000 పెట్టుబడి అవుతుంది. అదే కాకుండా ఎంత ఘనంగా పంటపడిన ఏడు క్వింటాల నుండి పది క్వింటాల దిగుబడి మాత్రమే వస్తుంది. క్వింటాలుకుఏడు వేల చొప్పున ఏడు క్వింటాళ్ల పత్తికి 49,000 మాత్రమే వస్తాయి. అన్ని అనుకూలించి వ్యవసాయ బావుల్లో నీళ్లు ఉండి సరిగా పంట పండితే, 70 వేల రూపాయలు వస్తాయి.
అందులో పెట్టుబడి రూ.45వేలు పోను కేవలం రూ.25 వేలు మాత్రమే మిగులుతాయి. పత్తి పంట కాలం 6 నెలల, రైతు కుటుంబం మొత్తం 180 రోజుల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా కరెంట్ మోటార్ రిపేర్ ఖర్చులు, తదితర ఖర్చులు మీద పడతాయి. గతంలో మాదిరి కాకుండా గులాబీ రంగు పురుగు సోకి పత్తి పంట పై తీవ్ర ప్రభావం సోకుతుంది. పత్తి పంట సరిగా రావడం లేదు. ఇంకా పచ్చ దోమ ఎర్ర దోమ తదితర రోగాలు సోకుతున్నాయి. ఇవి వాతావరణ కాలుష్యం వల్ల, భూమిలో ఇబ్బడి ముబ్బడిగా రసాయన ఎరువులు పోసి అందులో ఉండే క్రిమి కీటకాలను నాశనం చేయడం వల్ల వస్తున్నాయని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. అన్ని అనుకూలించి సరైన పంట పండితేనే రైతు మొహంలో చిరునవ్వు, లేదంటే అప్పల బాధ తప్పదు.
వరి విషయానికొస్తే, ప్రధాన ఆహార పంటగా ఉన్న వరి పంట, పెట్టుబడి తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, దీనికి ఉన్న సవాళ్లు అంతా అంతా కాదు. నారుమడి సిద్ధం చేసేందుకు గాను 1200 రూపాయలు, విత్తనాలకు రూ.1150, ప్రధానంగా పొలం దున్నడానికి ఎకరానికి ట్రాక్టర్ కు 7 వేల రూపాయలు, ఒడ్డు వరం చెక్కడానికి ముగ్గురుకూళ్ళకు మూడు వేల రూపాయలు, నాటు వేయడానికి రూ.5500, నారు మోయడానికి ₹1000, మొదటి దఫా డిఎపి, యూరియా, గడ్డి మందుకు ₹2500, రెండో దప పిండి వేయడానికి రూ.3000, కలుపుకు రూ.3000, మూడోదప ఫొటోస్, యూరియా, రూ.2500 ఇవి కాక మధ్యలో చీడ పురుగు సోకి, పంట గింజయ్య దశలో రసాయన ఎరువులు మూడు సార్లు కొట్టాలి, సుమారు 5000 రూపాయలు, చివరలో వరి కోయడానికి ఎకరాకు మూడు వేల రూపాయలు అవుతాయి.
ఇది కౌలు రైతులకు అదనం. ఆరుగాలం శ్రమ చేసే రైతన్న రెండు నెలలుగా వర్షం లేక ఆకాశం వైపు ఎదురు చూస్తున్నాడు. ఆరుగాలం శ్రమిస్తే చాలు కుటుంబం నడుస్తుందని ఆశపడిన రైతన్నకు వరుణదేవుడు కరుణించడం లేదు. ఇవేగాక పండించిన పంటను మార్కెట్ తరలించడానికి ట్రాక్టర్ కిరాయి రూ.1600, మార్కెట్ లో తేమ పేరిట 40 కిలోల బస్తాకి రెండు కిలోల కోత, క్వింటాల్‌కి 5 కిలోలు కోత వేస్తారు. క్వింటాకి 95 కిలోల ధర చెల్లిస్తారు. ఎన్ని నష్టాలు ఏర్పడినప్పటికీ, భూమిని నమ్ముకున్న రైతన్నలు వ్యవసాయాన్ని వదలడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని మారిన పాలకులు ఎందరు మారిన, రైతు బ్రతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి లాగానే ఉంది. స్వామినాథన్ కమిటీ సిఫారసు మేరకు పెట్టుబడికి రెండు రెట్లు మార్కెట్ ధర కల్పించినప్పుడు అన్నదాత మొహంలో ఆనందం వెల్లివిరుస్తుంది కావచ్చు.






