- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rag Mayur: అమ్మ మెచ్చింది... సివరపల్లి సిరీస్ ఫేమ్ రాగ్ మయూర్ ఇంటర్వ్యూ
అతనొక క్యారెక్టర్ చేస్తే ప్రేక్షకులు కనెక్ట్ కావాల్సిందే.. ప్రతీ సిట్యుయేషన్‌లో ఇమాజిన్ చేసుకోవాల్సిందే.

దిశ, ఫీచర్స్: అతనొక క్యారెక్టర్ చేస్తే ప్రేక్షకులు కనెక్ట్ కావాల్సిందే.. ప్రతీ సిట్యుయేషన్‌లో ఇమాజిన్ చేసుకోవాల్సిందే. ఇంతకీ ఎవరతను అనుకుంటున్నారా? ‘సివరపల్లి’ వెబ్ సిరీస్‌తో జనం మనసు దోచుకున్న మన ‘శ్యామ్ సార్’. ఇది సినిమాలో అతని పాత్ర పేరు. అసలు పేరు రాగ్ మయూర్. ఇతర సినిమాల్లో మరిడేష్ బాబు, వీరు వంటి క్యారెక్టర్స్‌తోనూ ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా ‘సివరపల్లి’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన ఆయనే ఈ రోజు మన గెస్ట్.. ప్రస్తుతం ‘సివరపల్లి’ పంచాయితీ సెక్రటరీగా ఆన్ డ్యూటీలో ఉన్న ఆయన.. అక్కడి సమస్యలు ఎట్లా సాల్వ్ జేసిండు.. ఇకపై ఏం జేయబోతున్నాడు.. సర్పంచ్‌కు సుట్టమైండా లేదా అమెరికా పోతండా..? దిశ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న పలు ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..
1. నమస్తే సెక్రటరీ గారు.. శ్యామ్ సార్ ఎట్లున్నరు..?
బాగానే ఉన్నానండి.. మా వాటర్ ట్యాంక్ నుంచి నీళ్ల సప్లై సరిగ్గా లేదంటా.. ఆ పనిలో బిజీగా ఉన్నాను.
2. ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న రాగ్ మయూర్.. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి?
మా సివరపల్లి వాటర్ ట్యాంక్ ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక మంచి ఫీలింగ్.. స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ.. ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లు..
3. దాదాపు 15 రోజులైనా అమెజాన్‌లో దూసుకుపోతున్నది ఈ సిరీస్.. సినిమా బండి కూడా అలాగే వైరల్ అయింది కదా.. ?
అవును.. రెండు అలాగే వైరల్ అయ్యాయి.. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ప్యూర్‌లీ వర్డ్ ఆఫ్ మౌత్‌తో. అప్పుడేమో ‘సినిమా బండి’ నెట్‌ఫ్లిక్స్‌లో వన్‌వీక్ నంబర్‌వన్ స్థానంలో ఉంది. ఇప్పుడేమో అమెజాన్‌లో ‘సివరపల్లి’ రెండు వారాలుగా రెండో స్థానంలో కంటిన్యూ అవుతూనే ఉంది. జనాలే మనల్ని అక్కడ కూర్చోబెట్టారనే నేచురల్ ఫీలింగ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వాడిని జనాలు అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టారంటే.. మన టాలెంట్ ఆదరిస్తున్నారని అనుకుంటున్నా. ఆ స్థాయి దేనితోనో కొనుక్కుంటే వచ్చేది కాదు. జనాలిచ్చిన కుర్చీ చాలా బాగుంది. మా చక్రాల కుర్చీ కన్నా ఇంకా బాగుంది.
4. మీరు చేసిన ప్రాజెక్ట్స్ భలే ట్రెండ్ అవుతున్నాయి కదా.. ఎలా చూజ్ చేసుకుంటున్నారు? ముందుగా ఏ విషయాన్ని కన్సిడర్ చేస్తరు?
స్టోరీ ఎంత కొత్తగా ఉంది.. మన రోల్‌కు ఎంత డెప్త్ ఉంది.. ఇంతకు ముందు చేసిన వాటితో ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా..? ఆ క్యారెక్టర్, స్క్రిప్ట్‌కు నేను ఎంత సహాయపడగలను.. నన్ను నేను ఎంత కొత్తగా జనాలకు చూపించుకోగలను.. మంచి ప్రొడక్షన్ హౌజ్.. ఇవి చూసుకుంటాను. ఎందుకంటే సినిమాలు తీయడం అంత కష్టం కాదు. రిలీజ్ చేయడమనేదే పెద్ద టాస్క్. మూవీ థియేటర్ రిలీజ్, ఓటీటీ టై అప్ లాంటివి అన్ని ఎక్స్‌పీరియన్స్, విజన్, టేస్ట్ ఉన్న వాళ్లకే సాధ్యం.
5. శ్యామ్ సార్ అందరిళ్లలో ఒక్కరిగా అయిపోయాడు. ముఖ్యంగా అమ్మలు ఎక్కువ కనెక్ట్ అయ్యారు.. నాన్నలు పెద్ద సర్పంచ్‌గా ఊహించుకుంటున్నారు.. ఆడియన్స్ అంత కనెక్ట్ అయ్యారు కదా క్రెడిట్స్ ఎవరికి ఇవ్వొచ్చు?
నేనైతే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యూత్ కనెక్ట్ అవుతారనుకున్నా.. ఎందుకంటే అంత స్లో కామెడీ జనాల్లోకి ఎక్కుతదా లేదా అనే ఆలోచన ఉండేది. థాంక్‌ఫుల్లీ ఆడియన్స్ అది రాంగ్ అని ప్రూవ్ చేశారు. ఒక మంచి కంటెంట్ ఉంటే చాలు నచ్చుతుందని చూపెట్టారు. వల్గారిటీ లేకుండా స్పెషల్లీ ఈ క్లీన్ కామెడీ.. మన డెయిలీ సంభాషణల నుంచి వచ్చే కామెడీతో కనెక్ట్ అయిపోతున్నారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ గురించి మెసేజ్ ఉంటుంది. అది మన ఇంట్లో ఆడవాళ్లకు కనెక్ట్ అవుతుంది. అందుకే ఫస్ట్ టైమ్ ఓటీటీ హిస్టరీలో అమ్మలు.. నాలుగున్నర గంటల వెబ్‌సిరీస్‌ను బింగ్ వాచ్ చేసి చూస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా ఆడియన్స్ టేస్ట్, మా టీవీఎఫ్ రైటింగ్ టీమ్‌దే.
6. ఇది రీమేక్ కదా.. ఇలాంటివి మనకెందుకులే అనిపించలేదా.. అంత కాన్ఫిడెన్స్‌తో ఎలా చేశారు?
అవునండి.. రీమేకే. కానీ కాన్ఫిడెన్స్ ఏంటంటే.. తెలంగాణ నేటివిటీకి చాలా క్లోజ్‌గా తీశాం. ఏదో అది హిట్ అయింది కదా.. ఇది కూడా హిట్ అవుతదనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో నామ్ కే వాస్తే అయితే చేయలేదు. ఈ సిరీస్ తెలుగు వాళ్లకు కనెక్ట్ అయి.. ఎంజాయ్ చేస్తూ అప్రిషియేట్ చేసేలా.. చాలా జాగ్రత్తగా డిసిప్లైన్డ్‌గా చేసిన సిరీస్ ఇది.
7. సర్పంచ్ చెప్పినప్పుడే పోసుకోవచ్చుగా ఈయనగారు అని మీమ్స్ కూడా వస్తున్నాయి.. బాగా ప్రమోట్ చేస్తున్నారు మీమర్స్.. ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది?
ఇందాక అన్నట్లు నేచురల్ వర్డ్ ఆఫ్ మౌత్ ఏదైతే ఉంటదో.. జెన్యూన్‌గా ఎంజాయ్ చేస్తే ఇలా ఆర్గానిక్‌గా మీమ్స్ పడుతాయి. వీటిని చూసి మళ్లీ సినిమా బండి గుర్తొచ్చింది. అప్పుడు కూడా ఇలా మీమ్స్‌తో మూవీని స్ప్రెడ్ చేశారు. ఏదైనా ఇలా ఆర్గానిక్‌గా వచ్చినప్పుడే బాగుంటది. ఎగ్జామ్‌లో కాపీ కొట్టి వందకు వంద సాధించడం కంటే, కష్టపడి ఎనభై మార్కులు తెచ్చుకున్న శాటిస్‌ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మాదీ అదే ఫీలింగ్. ఆడియన్స్ లవ్ పొందడం నిజంగా అదృష్టం. కొన్ని సెకన్ల రీల్స్‌కు అలవాటు పడిపోయిన జనాలు నాలుగున్నర గంటలు కూర్చుని, మా సిరీస్ చూస్తున్నారంటే జనాల్లోకి ఎంత ఎక్కిపోయిందో మీరే చెప్పాలి.
8. మీరు ఓ సినిమా చేస్తే ఆ క్యారెక్టర్ పేరు కూడా గుర్తుండిపోతుంది లైక్ మరిడేష్ బాబు, శ్యామ్ సార్ ఇలా.. మీ ట్విట్టర్ ఎకౌంట్లో కూడా ఈ నేమ్స్ అన్నీ పెట్టుకున్నరు.. మీ లైఫ్‌లో భాగమయ్యాయనా? దీనిపై స్పెషల్ వర్క్ ఏమైనా చేస్తారా?
నేను ఏ క్యారెక్టర్ చేసినా దాన్ని ప్రేమిస్తాను. అది నాలో ఒక భాగమైపోతుంది. అందుకే మరిడేష్ బాబు, లంచం, వీరు, ఇప్పుడు శ్యాం.. వాళ్లే నేను. నేను వాళ్లు. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్‌లోకి హండ్రెడ్ పర్సెంట్ వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తా. ఆ క్రమంలో ప్రతి క్యారెక్టర్‌తో ప్రేమలో పడిపోతా. అందుకే ఎక్స్ (ట్విట్టర్)లో అన్ని పేర్లు పెట్టుకుంటా.. మరి ట్విట్టర్ ఎన్ని క్యారెక్టర్స్ అలో చేస్తదో చూడాలి.
9. సిరీస్‌లో లాగా ఫ్రెండ్స్‌తో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయా? మందు కొట్టాలనిపిస్తే హాయ్ పెట్టాలనేది కూడా వైరల్ అయింది?
హ హ.. నేను యాక్చువల్లి మందు తాగనండి. కానీ నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. జిందగీ నా మిలేగీ దొబారా అని మాకో గ్రూప్ ఉంటది. అంటే ఎప్పటి నుంచో ట్రిప్ వెళ్లాలని ప్లాన్ చేసుకుని అలా పెట్టుకున్నాం. కానీ కుదర్లేదు. గ్రూప్ నేమ్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఏదైనా ఉంటే వాళ్లతో షేర్ చేసుకుంటా.
10. ఈ సిరీస్ చూశాక ఆ ఊరిలో ఉంటే బాగుండనే ఫీలింగ్ రెండు మూడు రోజులు వెంటాడింది. మిమ్మల్ని, పెద్ద సర్పంచ్, నరేష్ అందరిని మిస్ అయిన ఫీలింగ్.. ప్రాజెక్ట్ పూర్తయ్యాక మీకు కూడా ఇలాగే ఉందా?
నిజాయితీగా చెప్పాలంటే సిటీలో పుట్టి పెరిగాను. ఊళ్లో షూట్ చేయడం కాస్త కష్టంగానే ఉంది. ఎందుకంటే 33 రోజులు వరుసగా ఎండలో కంటిన్యూగా షూట్ చేశాం. శ్యామ్ సార్ లాగే ఎప్పుడెప్పుడు ఇంటికెళ్లి పోయి ప్రశాంతంగా బెడ్ మీద పడుకుందామా అనిపించింది. కానీ అక్కడ పంచాయితీ ఆఫీసు పక్కనే ట్యాంక్.. ఇలా ప్రతీ లొకేషన్ నేచురల్‌గా ఉంది. సిరీస్‌లో సెట్స్ అస్సలు యూజ్ చేయలేదు. దానివల్లే జనాలు మీరు చెప్పినట్లుగా కనెక్ట్ అయిపోయారు.
11. పిల్లాడి పేరు గోలలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు.. ఇంతకీ మీ ఫేవరేట్ హీరో ఎవరు?
కో ఇన్సిడెంటల్‌గా నా ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్. అది స్క్రిప్ట్‌లోనే ఉంది. నేనేమీ యాడ్ చేయలేదు. సో లక్కీగా నా ప్రాజెక్ట్‌లో ఆయన పేరు చెప్పే అవకాశమొచ్చింది. వెరీ వెరీ లక్కీ..
12.. ఏ స్టార్ కాంబినేషన్‌లో మూవీ చేయాలని ఉంది?
ప్రత్యేకంగా ఈ స్టార్ కాంబినేషన్‌లోనే మూవీ చేయాలని లేదండి. ఎవరితోనైనా చేయడానికి రెడీ. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తా.
13. అమెరికాలో సెటిల్ కావడం ఇష్టం కానీ తప్పక విలేజ్‌లో జాబ్ చేయాలనే పాత్రలో బ్యాలెన్స్‌డ్‌గా యాక్ట్ చేశారు ఇన్ఫాక్ట్ జీవించేశారు.. రియల్ లైఫ్‌లో కూడా అమెరికాలో ఉందామనుకున్నారా?
నేను రియల్ లైఫ్‌లో కొంచెం ఉల్టా చేశా. అమెరికా వెళ్లి చదువుకుని.. మళ్లీ తిరిగొచ్చేశా. మన దేశం అంటే నాకు చాలా ఇష్టం. షారుఖ్ ఖాన్ స్వదేశ్ సినిమా చూసి ఇన్‌స్పైర్ అయ్యా.. ఏదైనా ఇక్కడే అని వచ్చేశా.
14. యావరేజ్ స్టూడెంట్ లేదా బ్రిలియంట్?
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోనే. తర్వాత పద్మారావు నగర్. భారతీయ విద్యా భవన్‌లో చదువుకున్నా. ఉస్మానియూ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశా. యూఎస్‌లో మాస్టర్స్ చేశా. చిన్నప్పటి నుంచి స్కూల్‌లో టాపర్‌ను. ఎంసెట్‌లో ర్యాంకర్‌ను కూడా. ఇక యావరేజ్ స్టూడెంటా లేదా బ్రిలియంటా మీరే డిసైడ్ చేయండి.
15. సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు?
సినిమాపై ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉండే. వర్క్ స్టార్ట్ చేశాక థియేటర్ చేయడం మొదలెట్టా. దీంతో యాక్టింగ్‌పై ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి షార్ట్ ఫిల్మ్స్ చేయడం.. స్లోగా సినిమా బండికి డెమో ఫిల్మ్‌లో ఛాన్స్ ఇచ్చారు. ఈ ఫిల్మ్ అప్రూవ్ అయ్యాక మెయిన్ ఫిల్మ్‌లో కాస్ట్‌గా మమ్మల్నే పెట్టుకోవాలని డైరెక్టర్ రాజ్ అండ్ డీకే చెప్పారు. అలా బ్రేక్ వచ్చింది.
16. హీరోగానే కాదు విలన్‌గా కూడా అదరగొట్టారు? ఫ్యూచర్‌లో ఇంకా నెగెటివ్ షేడ్స్‌లో కనిపిస్తారా?
సినిమా కంటెంట్ బాగుంటే కచ్చితంగా చేస్తా. కమల్ హాసన్ గారు తన సినిమాల్లో విలన్‌గా చేస్తారు. ఫాహద్ ఫజిల్ గారు కూడా అలాగే చేస్తున్నారు కదా. ఒక యాక్టర్‌గా అన్నీ చేయాలనేది నా ఉద్దేశం.
17. పరదా మూవీలో మీ క్యారెక్టర్??
ఇందులో కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్.. మంచి ఎమోషనల్ ఆర్క్ ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్‌తో పేర్ అయ్యా.. ఒక్కసారి మూవీ డేట్ అనౌన్స్ చేస్తే.. మళ్లీ దిశతో కూర్చుని డిటెయిల్‌గా మాట్లాడుకోవచ్చు.
18. నెక్స్ట్ పార్ట్‌లో సర్పంచ్ బిడ్డతో లవ్ ఉందా??
నెక్స్ట్ పార్ట్ కోసం నేను కూడా వెయిటింగ్ అండి. చూద్దాం ఎట్లుంటదో.. సర్పంచ్ బిడ్డతో ప్రేమ.. గరిజలా.. చాయా.. చూద్దాం.
19. ప్రతీ ఎపిసోడ్‌లోనూ మంచి సోషల్ మెసేజ్ ఉంది కదా..
అవునండి.. చాలా చాలా మంచి టాపిక్స్ డీల్ చేశాం. పైన కోటింగ్ హ్యూమర్.. లోపల మాత్రం మంచి మెసేజ్ ఉంది. అందుకనే ఆకట్టుకున్నట్లుంది. బాలికా విద్య, ఉమెన్ ఎంపవర్‌మెంట్, దెయ్యాలున్నాయనే మూఢ నమ్మకాలు, బహిరంగ విసర్జన. ఇలా చాలా టాపిక్స్ కవర్ అయ్యాయి. అందుకే బ్లాక్ బస్టర్ హిట్ అయిందేమో






