Inter exams: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం

by Malleboina Mahesh |

తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం. మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా, 1,495 కేంద్రాల్లో సిసి కెమెరాల నిఘా మధ్య ఏర్పాట్లు పూర్తి.

Inter exams: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు (Intermediate Annual Examinations) అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించగా, రేపటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలు కానున్నాయి. విద్యార్థుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక బస్సులను నడుపుతుండగా, పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.

మొత్తం పరీక్షల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఇంటర్ బోర్డు (Inter Board) సిసి కెమెరాల నిఘాతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించింది. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కఠినంగా నిషేధించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏవైనా సమస్యలు, సందేహాలుంటే సంప్రదించడానికి బోర్డు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచింది.

ఇదిలా ఉంటే ఈ సంవత్సరం మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అందులో ప్రథమ సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 863 ప్రైవేటు కాలేజీలు, 404 ప్రభుత్వ కళాశాలలు, 221 ఎయిడెడ్ కాలేజీలు, మరో 7 ఇతర విద్యాసంస్థలను పరీక్షా కేంద్రాలు గా ఎంపిక చేశారు.

Next Story