- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశం కోసం కాళ్లు కోల్పోయిన సైనికుడికి ఘోర అవమానం
దేశం కోసం తన కాళ్లు కోల్పోయిన సైనికుడికి ఘోర అవమానం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : దేశం కోసం తన కాళ్లు కోల్పోయిన సైనికుడికి ఘోర అవమానం జరిగింది. కర్ణాటకలోని ఉడుపి సమీపంలోని శాస్తాన్ టోల్ గేట్ వద్ద విధి నిర్వహణలో కాళ్లు కోల్పోయిన ఆర్మీ కమాండో శ్యామరాజ్‌కు జరిగిన అవమానం సంచలనం రేపుతోంది. RMA (Released Medical Category) కింద ఉన్న శ్యామరాజ్‌కు టోల్ మినహాయింపు ఉన్నప్పటికీ.. టోల్ సిబ్బంది ఆయనను వేధించి డబ్బులు కట్టాలని ఒత్తిడి చేశారు. భార్యకు పోస్టింగ్ రావడంతో కారులో ప్రయాణిస్తున్న సమయంలో టోల్ గేట్ వద్ద ఆర్మీ ఐడీ, డిసేబిలిటీ సర్టిఫికెట్, RMA ఆర్డర్ చూపించినా 'ఇక్కడ అలాంటి రూల్స్ లేవు' అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించారు.
దీనితో తీవ్ర ఆవేదనకు గురైన శ్యామరాజ్ ఆ ఘటనను సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "దేశం కోసం కాళ్లు కోల్పోయినవాడిని ఇలా అవమానించడం ఎంత బాధాకరం" అంటూ ఆయన మాట్లాడిన మాటలు నెటిజన్లను కలచివేశాయి. దేశం కోసం జీవితాన్ని పణంగా పెట్టిన సైనికుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. ఈ వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. టోల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కర్ణాటక టోల్ ప్లాజా అథారిటీ నుంచి, NHAI నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.






