నల్ల బ్యాడ్జీలతో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

by Disha Web Desk 2 |
నల్ల బ్యాడ్జీలతో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన
X

దిశ, ఆలేరు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అవమానపరిచే విధంగా ప్రవర్తించిన స్పీకర్ వైఖరిని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నియజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మంగళవారం ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి నల్ల బ్యాడ్జిలతో మౌనదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుడుదుల నగేష్, ఎంపీటీసీ ఆరే ప్రశాంత్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ కట్టగొమ్ముల సాగర్ రెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు ఎంఏ ఎజాజ్, కొండ్రాజు వెంకట్రాజు, నాయకులు నీలం వెంకటస్వామి, ఉప్పలయ్య, కర్రె అజయ్, పర్రె రమేష్, లోకేష్, జూకంటి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story