- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తపల్లి కల సాకారం.. రూ.1.20 కోట్ల బ్రిడ్జి పనుల పరిశీలన
బజార్ హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన (బ్రిడ్జి) పనులను గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కలిసి పరిశీలించారు.

దిశ, బజార్ హత్నూర్ : బజార్ హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన (బ్రిడ్జి) పనులను గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న కలెక్టర్, ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, ఆర్‌అండ్‌బీ ఈఈ శివరాం నుంచి పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు త్వరితగతిన వంతెన అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వంతెన నిర్మాణం తమ కల అని, దానికి నిధులు మంజూరు చేసి పనులు చేపట్టిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, గిర్నూర్ సర్పంచ్ ప్రియాంక, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






