ఇండిగో బంపర్ ఆఫర్లు... రూ.1449 కే టికెట్స్

by Muthe.Rajitha |

ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఇండిగో బంపర్ ఆఫర్లు... రూ.1449 కే టికెట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 'Sail into 2026' అనే పేరుతో భారీ సేల్‌ను తీసుకు వచ్చింది. ఈ ఆఫర్‌లో డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్లు కేవలం రూ.1,499 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ లిమిటెడ్ పీరియడ్ సేల్ జనవరి 13 నుంచి జనవరి 16 వరకు మాత్రమే ఉంటుంది. ఈ టికెట్లతో జనవరి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్య తేదీల్లో ట్రావెల్ చేయవచ్చు. అయితే ఫ్లైట్ డిపార్చర్ తేదీకి కనీసం 7 రోజుల ముందే టికెట్ బుక్ చేయాలి. డొమెస్టిక్ ఫ్లైట్లకు ఒక్కో వైపు రూ.1,499 నుంచి, ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు రూ.4,499 నుంచి టికెట్లు లభిస్తున్నాయి. సెలెక్ట్ డొమెస్టిక్ రూట్లలో ఎక్స్‌ట్రా లెగ్ రూమ్ ఉన్న IndiGoStretch సీట్లు రూ.9,999 నుంచి ఉన్నాయి.

అదనంగా బ్యాగేజ్, సీట్ సెలెక్షన్, ఫాస్ట్ ఫార్వర్డ్ వంటి 6E అడ్-ఆన్స్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బుక్ చేస్తే రూ.7,500 వరకు ఆదా అవుతుంది. 0 నుంచి 24 నెలల లోపు శిశువులకు డొమెస్టిక్ రూట్లలో కేవలం రూ.1కే టికెట్ ఇవ్వడం విశేషం. అయితే ఈ ఆఫర్ పరిమిత సీట్లకే వర్తిస్తుంది, నాన్-స్టాప్ ఫ్లైట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. టికెట్లు రీఫండ్ లేదా ట్రాన్స్‌ఫర్ చేయలేరు. అలాగే ఇతర ఆఫర్లతో కలిపి ఉపయోగించలేరు.

Next Story