- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన ఇండిగో
ఇరాన్ (Iran)లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ (Iran)లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంటూ, ఇరాన్ మీదుగా ప్రయాణించే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో ఢిల్లీ (Delhi) నుంచి టీబీలీసీ (జార్జియా), ముంబై నుంచి అల్మట్టి (కజకిస్థాన్) మధ్య నడిచే విమాన సర్వీసులను ఇండిగో ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసింది. వాటితో పాటు తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్), బాకు (అజర్బైజాన్) వెళ్లే సర్వీసులపైనా ప్రభావం పడింది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ప్రయాణికుల కోసం ఇండిగో ప్రత్యేక ట్రావెల్ అడ్వైజరీ (Travel Advisory) జారీ చేసింది. జనవరి 26 నుంచి 28 వరకు సర్వీసుల రద్దులు, మార్పులు కొనసాగాతాయని ఇండిగో సంస్థ తెలిపింది. ఇక కొన్ని విమానాలు తమ ప్రయాణ మార్గాన్ని మార్చుకోవడం వల్ల, ఇంధనం కోసం ఖతార్ రాజధాని దోహాలో స్వల్పకాలం ఆగాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
కాగా, ఇరాన్ దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, అమెరికా (America)తో పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల వల్ల ఆ దేశ గగనతలం ప్రమాదకరంగా మారింది. క్షిపణి దాడుల ముప్పు పొంచి ఉన్నందున ఎయిర్ ట్రాఫిక్ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.






