Monkeypox: దడ పుట్టిస్తోన్న మంకీపాక్స్.. దేశంలో మరో పాజిటీవ్ కేసు నమోదు?

by Disha Web |
Indias Second Monkeypox Case Confirmed in Kerala
X

దిశ, వెబ్‌డెస్క్: India's Second Monkeypox Case Confirmed in Kerala| దేశమంతటా ఇప్పటికీ కరోనా కలకలం సృష్టిస్తోంది. అయితే కరోనా తర్వాత అంతగా భయపెడుతున్న వ్యాధి మంకీపాక్స్. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు బయటపడటంతో అందరిలోనూ వణుకు పుట్టిస్తోంది. ఇటీవల తొలి మంకీపాక్స్ కేసు కేరళలో ఓ చిన్నారికి సోకిందని దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కానీ అది మంకీపాక్స్ కాదని, ఆ చిన్నారికి వచ్చింది సాధారణ దద్దుర్లేనని తేలింది. ఈ క్రమంలోనే తాజాగా, దేశంలో మరో మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. కేరళలోని కన్నురులో 32 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ వచ్చిందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సోమవారం తెలిపారు.

మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేరళ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఐదు జిల్లాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణాది రాష్ట్రం కేరళలో మంకీపాక్స్‌ కేసు నమోదైన రెండు రోజుల వ్యవధిలోనే కేరళలో మరో మంకీపాక్స్‌ కేసు నమోదుకావటం కలకలం రేపుతోంది. షార్జా-తిరువనంతపురం ఇండిగో విమానంలో వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్‌ సోకిన వ్యక్తితో కలిసి తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయంకు చెందిన ప్రయాణికులు రావటంతో ఆ ఐదు జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక జారీ చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: భారత్‌లో పెరుగుతున్న కరోనా.. కొత్త కేసులెన్నో తెలుసా?



Next Story

Most Viewed