దేశంలో వేగంగా పెరుగుతున్న 'ఘోస్ట్ మాల్స్'

by Dishanational1 |
దేశంలో వేగంగా పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన కొన్నేళ్లలో వినియోగదారుల షాపింగ్ ధోరణిలో చాలా వేగవంతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పటిలా కస్టమర్లు చిన్నా చితకా స్టోర్ల వంక చూడ్డంలేదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు వెళ్లే ఏదైనా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 'ఘోస్ట్ మాల్స్ ' సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ప్రముఖ స్థిరాస్తి రంగ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తానా నివేదిక ప్రకారం, గతేడాది కంటే ఈసారి ఘోస్ట్ మాల్స్ 58 శాతం పెరిగాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోనే వీటి పెరుగుదల ఎక్కువ ఉందని నివేదిక స్పష్టం చేసింది. అసలు ఈ ఘోస్ట్ మాల్స్ ఏంటంటే.. కస్టమర్లు పెద్ద షాపింగ్ మాల్స్‌లోనే కొనేందుకు వెళ్తుండటం వల్ల చిన్న చిన్న మాల్స్‌లో గిరాకీ దెబ్బతిన్నది. అలా గిరాకీ లేకుండా ఉండిపోయిన వాటినే ఘోస్ట్ మాల్స్‌గా పరిగణిస్తారు. సాధారణంగా అందుబాటులో ఉండే ఒక మాల్‌లో 40 శాతం ఖాళీగా ఉంటే వాటిని ఘోస్ట్ మాల్స్‌గా వ్యవహరిస్తారు. నైట్‌ఫ్రాంక్ ఇండియా చెబుతున్న దాన్ని బట్టి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇటువంటి మాల్స్ 2022లో 57 ఉంటే గతేడాది 64కి పెరిగాయి. 29 నగరాల్లో 58 హైస్ట్రీట్స్, 340 షాపింగ్ సెంటర్లను పరిశీలించిన తర్వాత ఈ డేటా రూపొందించినట్టు నివేదిక పేర్కొంది. ఈ 64 ఘోస్ట్ మాల్స్ పరిమాణం సుమారు 1.33 కోట్ల చదరపు అడుగులు వాడకుండా అలాగే ఉన్నాయి. పరిమాణంలో ఇది గతేడాది కంటే 58 శాతం పెరిగింది. ఢిల్లీ తర్వాత ముంబై, బెంగళూరు నగరాల్లో ఈ ఘోస్ట్ మాల్స్ పెరగ్గా, హైదరాబాద్‌లో మాత్రం 19 శాతం తగ్గాయి. ఈ ఘోస్ట్ మాల్స్ కారణంగా మొత్తం రిటైల్ రంగానికి రూ. 6,700 కోట్ల నష్టం ఏర్పడిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. పెద మాల్స్‌లో కొనుగోళ్లకే ఎక్కువమంది ఆసక్తి చూపించడం వల్ల చిన్న చిన్న మాల్స్ మూతపడుతున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా డైరెక్టర్ గులాం జియా పేర్కొన్నారు.

Next Story

Most Viewed