భారత్ స్నేహపూర్వక దేశమే కానీ.. విదేశాంగ మంత్రి జైశంకర్

by Dishanational2 |
భారత్ స్నేహపూర్వక దేశమే కానీ.. విదేశాంగ మంత్రి జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ ప్రపంచ దేశాలతో ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుందని కానీ..శక్తివంతమైన దేశంగా కూడా మారిందని విదేశాంగ మంత్రి జైశంకర్ కొనియాడారు. ఢిల్లీ యూనివర్సిటీలోని హన్స్ రాజ్ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘వికసిత భారత్ @2047 - ది వాయిస్ ఆఫ్ ది యూత్’ అనే అంశంపై జైశంకర్ ప్రసంగించారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో చిక్కుకున్న తమ పౌరులను తిరిగి తీసుకురావడానికి భారత్‌ ఎన్నో రెస్క్యూ ఆపరేషన్‌లు చేపట్టిందని తెలిపారు. ‘వికసిత భారత్ అనేది కేవలం ప్రజలను చైతన్యపరిచే నినాదం కాదు, గత పదేళ్లలో నిర్మించిన పునాది. దీని ఆధారంగా రాబోయే 25 ఏళ్ల భారత భవిష్యత్ నిర్మించబడింది’ అని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ ప్రయాణాన్ని సుసాధ్యం చేసే బాధ్యత విద్యార్థులపైనే ఉందని చెప్పారు. 25ఏళ్లలో వచ్చే మార్పు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక రంగం, ప్రపంచ సదస్సుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని తెలిపారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో అగ్రగామిగా అవతరించిందన్నారు. ఒక సినిమా తీయడానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3ని రూపొందించి విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపామని ప్రశంసించారు.

Next Story