- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత జీడీపీ 6.6% కే పరిమితం
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ అనుకున్న మేరకు వృద్ధిని సాధించలేదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ గ్లోబల్ సంస్థ అంచనా వేసింది.

దిశ, వెబ్ డెస్క్ : భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో అనుకున్న మేరకు వృద్ధిని సాధించలేదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ (S&P) గ్లోబల్ సంస్థ అంచనా వేసింది. సంస్థ తాజా నివేదిక ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత జీడీపీ (GDP) వృద్ధి రేటు కొంత నెమ్మదించి 6.6 శాతానికి పరిమితం కానుందని పేర్కొంది. గతంలో ఈ వృద్ధి 7.1 శాతంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఈ అంచనాలను సవరించడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో మాత్రం వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అయితే ఈ అంచనాల తగ్గింపుకు ప్రధానంగా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణమని ఎస్‌అండ్‌పీ విశ్లేషించింది.
దెబ్బ తీయనున్న పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం (Inflation) పెరిగే ముప్పు ఉందని అంచనా వేస్తోంది. అలాగ దిగుమతుల భారం పెరిగి కరెంట్ అకౌంట్ లోటుపై ప్రభావం పడటం వంటి అంశాలు వృద్ధిని మందగించేలా చేస్తున్నాయి. భారత్ నిర్దేశించుకున్న 'వికసిత్ భారత్ - 2047' లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏటా స్థిరంగా 8 శాతం కంటే ఎక్కువ వృద్ధి సాధించాలని 'ఇండియా ఫార్వర్డ్' (India Forward) పేరుతో విడుదల చేసిన ఈ జాయింట్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇందుకోసం ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ స్టోరేజ్ పాలసీ వంటి రంగాల్లో తక్షణ సంస్కరణలు అవసరమని సూచించింది.
భారీగా పెరగనున్న ద్రవ్యోల్భణం
అయితే మూడీస్ మాత్రం ఈ ఒడిదుడుకులు తాత్కాలికమేనని భారత్ వద్ద ఉన్న భారీ విదేశీ మారక నిల్వల సహాయంతో వీటన్నిటిని తేలిగ్గానే ఎదుర్కోగలుగుతుందని అంచనా వేసింది. మరోవైపు మిడిల్ ఈస్ట్ దేశాల ఉద్రిక్తతల వల్ల భారత జీడీపీ 6.3% కే పరిమితం కావొచ్చని ఏడీబీ అంచనా వేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం గణనీయంగా 2.4 శాతం మేర పెరిగి 6.9 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది.






