రోహిత్, కోహ్లీల రికార్డులను బ్రేక్ చేసిన భారత మహిళా క్రికెటర్

by Malleboina Mahesh |

స్మృతి మంధాన వరల్డ్ రికార్డ్! టీ20ఐల్లో రోహిత్ శర్మ, కోహ్లీలను అధిగమించి భారత్ తరపున అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచారు.

రోహిత్, కోహ్లీల రికార్డులను బ్రేక్ చేసిన భారత మహిళా క్రికెటర్
X

దిశ, వెబ్ డెస్క్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఆమె రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రికార్డులను అధిగమించారు. తద్వారా టీ20ఐల్లో (పురుషులు & మహిళలు కలిపి) భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. 155 ఇన్నింగ్స్‌ల్లో 4,244 పరుగులు చేసిన స్మృతి.. 154 ఇన్నింగ్స్‌ల్లో 4,231 పరుగులు చేసిన రోహిత్, 117 ఇన్నింగ్స్‌ల్లో 4,188 పరుగులు చేసిన కోహ్లీని వెనక్కి నెట్టారు.

ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ కంటే కేవలం ఒక్క పరుగు వెనుకబడి ఉన్న స్మృతి, ఇన్నింగ్స్ రెండో బంతికే సింగిల్ తీసి ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆమె 13 పరుగులు (14 బంతుల్లో) చేసి అవుట్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన సూజీ బేట్స్ (4,717) అగ్రస్థానంలో ఉండగా, స్మృతి మంధాన రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఒక మహిళా క్రీడాకారిణి పురుష క్రికెటర్ల రికార్డులను దాటడం భారత క్రికెట్ ఎదుగుదలకు నిదర్శనమని క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

Next Story