- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలోనూ భారత గణతంత్ర వేడుకల జోరు.. 5 రాష్ట్రాల్లో అధికారికంగా 'ఇండియా రిపబ్లిక్ డే'!
అలాస్కా, వాషింగ్టన్, నెబ్రాస్కా, సౌత్ డకోటా, ఒరెగాన్ వంటి రాష్ట్రాలు జనవరి 26, 2026ను అధికారికంగా ‘రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా’గా ప్రకటిస్తూ ప్రత్యేక ప్రొక్లమేషన్లు విడుదల చేశాయి.

దిశ, వెబ్ డెస్క్: భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడకల (Republic Day celebrations) జోరు అమెరికాలోనూ కొనసాగుతోంది. అలాస్కా, వాషింగ్టన్, నెబ్రాస్కా, సౌత్ డకోటా, ఒరెగాన్ వంటి రాష్ట్రాలు జనవరి 26, 2026ను అధికారికంగా ‘రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా ('Republic Day of India')’గా ప్రకటిస్తూ ప్రత్యేక ప్రొక్లమేషన్లు (Proclamations) విడుదల చేశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ సాధించిన ప్రగతిని గౌరవిస్తూ, ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ గౌరవం దక్కడం విశేషం.
ఈ ప్రకటనల ద్వారా అమెరికాలోని భారతీయ మూలాలున్న ప్రజలు ఆయా రాష్ట్రాల ఆర్థిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో చేస్తున్న విశేష కృషిని అక్కడి ప్రభుత్వాలు కొనియాడాయి. భారత్-అమెరికా మధ్య ఉన్న దశాబ్దాల నాటి స్నేహ సంబంధాలను, ప్రజాస్వామ్య విలువలను ఈ వేడుక మరింత బలపరుస్తుందని గవర్నర్లు తమ సందేశాల్లో పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, రక్షణ, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుతుందని ఆకాంక్షించారు. ఏది ఏమైనప్పటికి గణతంత్ర వేడుకలను 5 రాష్ట్రాల్లో అధికారికంగా 'ఇండియా రిపబ్లిక్ డే గా ప్రకటించండపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.






