వైజాగ్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు.. విండో సీట్‌లో శ్రేయస్

by Gantepaka Srikanth |

భారత్ - న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ వైజాగ్ వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే.

వైజాగ్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు.. విండో సీట్‌లో శ్రేయస్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ వైజాగ్ వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం రాత్రి భారత ఆటగాళ్లు వైజాగ్ చేరుకున్నారు. గౌహతి నుంచి ప్రత్యేక విమానాల్లో వైజాగ్‌కు వచ్చారు. విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన వారికి కేటాయించిన బస్సుల్లో హోటల్‌కు వెళ్లిపోయారు. మరోవైపు ఇప్పటికే న్యూజిలాండ్‌ ప్లేయర్లు కూడా వైజాగ్ చేరుకున్నారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే భారత్ 3-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో టీ20ల్లో భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడింట విజయం సాధించింది. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య వైజాగ్‌లో టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ నెల 28న (బుధవారం) నాలుగో మ్యాచ్‌ జరగనుంది.

భారత జట్టు: అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

Next Story