ఇరాన్‌కు ప్రయాణాలు వద్దు : భారత్ హెచ్చరిక

by Muthe.Rajitha |

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, టెహ్రాన్‌లోని భారత ఎంబసీ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.

ఇరాన్‌కు ప్రయాణాలు వద్దు : భారత్ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల దృష్ట్యా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), టెహ్రాన్‌లోని భారత ఎంబసీ మరోసారి కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్‌లో మారుతున్న పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భారతీయులెవరూ ప్రస్తుతం ఇరాన్‌కు ప్రయాణం చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. విమాన మార్గం ద్వారా గానీ, భూమార్గం ద్వారా గానీ ఇరాన్ వెళ్లడం సురక్షితం కాదని MEA పేర్కొంది. ఇప్పటికే ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు, ఇతర పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి రావాలని ప్రభుత్వం సూచించింది. ఇరాన్ నుంచి బయటకు వచ్చే క్రమంలో కేవలం భారత ఎంబసీ సూచించిన సురక్షిత మార్గాలను మాత్రమే అనుసరించాలని హెచ్చరించింది. అక్కడ ఉన్న భారతీయులందరూ వెంటనే భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి, తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరింది.

అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు:

ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు లేదా వారి కుటుంబ సభ్యులు ఏవైనా సందేహాల కోసం కింద పేర్కొన్న నంబర్లను సంప్రదించవచ్చు:

+98 912 810 9115

+98 912 810 9102

+98 912 810 9109

+98 993 217 9359

ఈమెయిల్: [email protected]

Next Story