అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం పొడిగింపు: డీజీసీఏ కీలక నిర్ణయం

by Web Desk |
అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం పొడిగింపు: డీజీసీఏ కీలక నిర్ణయం
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ప్రయాణాలపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 'తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు షెడ్యూల్డ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సేవలపై నిషేధాన్ని పొడిగించాలని కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించింది' అని పేర్కొంది. అయితే ఈ నిబంధనలు కార్గో విమానాలతో పాటు ప్రత్యేక అనుమతులు ఉన్నవాటికి వర్తించవని స్పష్టం చేసింది. ఎయిర్ బబుల్‌లో నడుస్తున్న విమానాలకు ఈ ప్రకటనతో సంబంధం లేదని తెలిపింది. కరోనా మహమ్మారి రాకతో 2020 మార్చి 23న అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించింది. గత ఏడాది డిసెంబర్ 15న ఈ నిబంధన ఎత్తివేసినప్పటికీ, ఒమిక్రాన్ ప్రభావంతో తిరిగి కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎప్పటి వరకు అమలులో ఉంటుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.


Next Story