- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థామస్ కప్.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
డెన్మార్క్‌లోని హోర్సెన్స్‌లో జరుగుతున్న థామస్ కప్ 2026 టోర్నమెంట్‌లో భారత పురుషుల బాడ్మింటన్ జట్టు దూసుకుపోతోంది.

దిశ, వెబ్ డెస్క్ : డెన్మార్క్‌లోని హోర్సెన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక థామస్ కప్ 2026 టోర్నమెంట్‌లో భారత పురుషుల బాడ్మింటన్ జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. మే 1న జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి, భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 2022లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న భారత్, ఇప్పుడు మరోసారి పతకం దిశగా బలమైన అడుగులు వేస్తోంది. మే 2న జరగనున్న సెమీఫైనల్లో భారత్, ఫ్రాన్స్ లేదా జపాన్ మ్యాచ్ విజేతతో తలపడనుంది. గ్రూప్ స్టేజ్‌లో కెనడా, ఆస్ట్రేలియాలపై భారీ విజయాలు సాధించిన భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు గట్టి పోటీ ఇచ్చి రన్నరప్‌గా నిలిచింది. అయితే క్వార్టర్స్‌లో చూపించిన పట్టుదల చూస్తుంటే, భారత్ ఫైనల్‌కు వెళ్లడం ఖాయమనిపిస్తోంది. మే 3న జరిగే ఫైనల్ పోరులో భారత్ మళ్లీ ట్రోఫీని ముద్దాడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.






