Ind vs NZ: టాస్ గెలిచిన భారత్.. సొంతగడ్డపై సంజూ శాంసన్ ఎంట్రీ

by Malleboina Mahesh |

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచుల టీ20 సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Ind vs NZ: టాస్ గెలిచిన భారత్.. సొంతగడ్డపై సంజూ శాంసన్ ఎంట్రీ
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచుల టీ20 సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఐదో టీ20.. కాసేపట్లో ప్రారంభం కానుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్‌లో మంచు (Dew) ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ తమ బౌలర్లను పరీక్షించేందుకు లక్ష్య ఛేదన కాకుండా, లక్ష్యాన్ని కాపాడుకునే (Defending) నిర్ణయం తీసుకున్నట్లు సూర్య తెలిపారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో లోకల్ ప్లేయర్ సంజూ శాంసన్ తుది జట్టులో ఉండటంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోతోంది. భారత జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి.

అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి రాగా, సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగుతున్నారు. అలాగే న్యూజిలాండ్‌లో జట్టులో ఏకంగా నాలుగు మార్పులు జరిగాయి. కాన్వే స్థానంలో ఫిన్ అలెన్, చాప్‌మన్ స్థానంలో బెవన్ జాకబ్స్ వచ్చారు. అలాగే కైల్ జేమీసన్, లాకీ ఫెర్గూసన్ తిరిగి జట్టులోకి చేరారు. మ్యాట్ హెన్రీకి ముందు జాగ్రత్తగా విశ్రాంతి కల్పించినట్లు కెప్టెన్ సాంట్నర్ తెలిపారు.

భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్ జట్టు: టిమ్ సీఫెర్ట్ (కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమీసన్, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ.

Next Story