IND Vs NZ: అభిషేక్ శర్మ మెరుపులు.. తొలి టీ20లో భారత్ ఘన విజయం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-21 17:20:30  IST  )

నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది.

IND Vs NZ: అభిషేక్ శర్మ మెరుపులు.. తొలి టీ20లో భారత్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా 48 పరుగులు తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ధాటిగా ఆడిన అభిషేక్, రింకూ..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (84) ఆకాశమే హద్దుగా చెలరేగి కివీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. చివర్లో రింకూ సింగ్ తనదైన శైలిలో మెరుపులు మెరిపించడంతో భారత్ కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 2, కైల్ జేమీసన్ 2, క్రిస్టియన్ క్లార్క్, ఇష్ సోది, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

ఒత్తిడిలోకి వెళ్లిన న్యూజిలాండ్ జట్టు..

ఇక 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి తడబడింది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ మధ్య ఓవర్లలో కీలక వికెట్లు తీసి కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (78), చాప్‌మన్ (39), డారెల్ మిచెల్ (28) పోరాటం చేసినప్పటికీ టార్గెట్ రీచ్ కాలేకపోయారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2. శివమ్ దూబె 2, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Next Story