హర్ట్ అయిన 'భీమ్లా నాయక్' హీరోయిన్.. ట్వీట్ వైరల్

by Web Desk |
హర్ట్ అయిన భీమ్లా నాయక్ హీరోయిన్.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: 'భీమ్లా నాయక్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. భీమ్లా నాయక్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే, డానియల్ శేఖర్‌ అయిన రానా దగ్గుబాటితో జతకట్టినప్పటికీ ఈ చిత్రంలో సంయుక్త పాత్ర అంత ముఖ్యమైనది కాదు. అయినా తన నటనతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది. ఈ సినిమా స్క్రీన్ టైమ్ విషయంలో సంయుక్త నిరాశకు గురైందని వార్తలు వచ్చాయి. ఆమె సినిమా కోసం దాదాపు 20 రోజులు పని చేసింది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో తనకు మంచి అవకాశం ఇవ్వలేదు. దాంతో ఆమెకు ఈ చిత్రంలో పెద్దగా స్కోప్ రాలేదని గాసిప్‌లు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే, తాజాగా.. ఈ రూమర్లపై స్పందించిన సంయుక్తా ఇతర కారణాల వల్ల తాను మనస్తాపం చెందానని అంగీకరించింది. "అభిమానులందరితో కలిసి సినిమాని రెండోసారి చూసేందుకు టిక్కెట్లు దొరకనప్పుడు భీమ్లా నాయక్‌తో నేను నిరాశ చెందాను" అని పుకారుపై సంయుక్త ట్వీట్ చేశారు. 'భీమ్లా' విడుదలకు ముందే సంయుక్త ధనుష్ నటించిన 'సర్'కి సంతకం చేసింది. 'భీమ్లా' సక్సెస్‌తో ఆమె రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్ట్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది.


Next Story