- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సులానగర్ పీహెచ్సీను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఇల్లందు ఎమ్మెల్యే
ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య సోమవారం ఉదయం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.

దిశ, టేకులపల్లి: ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య సోమవారం ఉదయం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఎమ్మెల్యే, అక్కడ చికిత్స పొందుతున్న రోగులను నేరుగా కలిసి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గర్భిణీలకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన పరీక్షలు, మందులు సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా, ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా, ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచే విధంగా పని చేయాలని వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డా. కంచర్ల వెంకటేష్, స్థానిక సర్పంచ్ పూల్ బంతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






