- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెబ్బేరు సంతలో కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్లు
పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంత కోసం వేలం వేయకపోయినప్పటికీ, కాంట్రాక్టర్లు పెబ్బేరు సంతలో విచ్చలవిడిగా పన్ను వసూలు చేస్తున్నారని మండల సీపీఎం కార్యదర్శి బాలయ్య ఆరోపించారు.

దిశ, పెబ్బేరు : పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంత కోసం వేలం వేయకపోయినప్పటికీ, కాంట్రాక్టర్లు పెబ్బేరు సంతలో విచ్చలవిడిగా పన్ను వసూలు చేస్తున్నారని మండల సీపీఎం కార్యదర్శి బాలయ్య ఆరోపించారు. సంతలో జరుగుతున్న అక్రమ వసూళ్ల పై ఆయన మాట్లాడుతూ, జనవరి 2025 సంవత్సరం నుంచి పెబ్బేరు పురపాలక సంఘానికి కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించడం లేదని తెలిపారు. ఇప్పటివరకు, 2026 జూలై నాటికి, దాదాపు రూ.5 కోట్ల 50 లక్షల మేర పెబ్బేరు పురపాలక సంఘం ఆదాయానికి కాంట్రాక్టర్లు గండికొట్టారని ఆరోపించారు. సంత ట్యాక్స్ వసూలు చేయడంలో అధికార, ప్రతిపక్ష నాయకులు కలిసి వ్యవహరిస్తున్నారని, ప్రజలు సంతలో అమ్ముకోవడానికి జీవాలను తీసుకొస్తే ఎంట్రీ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తున్నారని తెలిపారు.
కొనుగోలు చేసిన వారితో కూడా పన్ను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పురపాలక సంఘ అధికారులకు కూడా వాటా ఉన్నట్లు అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. పెబ్బేరు సంతలో పురపాలక సంఘం పేరుతో ఉన్న రసీదు పుస్తకాలతోనే కాంట్రాక్టర్లు రసీదులు ఇస్తున్నారని తెలిపారు. దీనిపై మున్సిపల్ మేనేజర్ గణేష్‌బాబును వివరణ కోరగా, సంత స్థలం కోర్టు పరిధిలో ఉన్నందున సంత విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అలాగే, రసీదులను తమ అనుమతి లేకుండా దౌర్జన్యంగా ప్రింట్ చేయించుకుని వాడుతున్నారని చెప్పారు. పురపాలక సంఘం పేరు చెప్పుకొని పెబ్బేరు సంతకు వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన ప్రజల నుంచి ఇష్టారాజ్యంగా పన్ను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కావున జిల్లా పురపాలక సంఘ అధికారులు, జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.






