- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. టెండర్లకు ఆహ్వానం పలికిన కేంద్రం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల వద్ద కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ వంతెనకు కేంద్రం టెండర్లు ఆహ్వానించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల వద్ద కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ వంతెనకు కేంద్రం టెండర్లు ఆహ్వానించింది. రూ.816.10కోట్ల అంచనా వ్యయంతో 1077 మీటర్ల పొడవున ఈహైబ్రిడ్ వంతెనను ఈపీసీ విధానంలో 36 నెలల్లో పూర్తి చేయనున్నారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే నంద్యాల, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కర్నూలు మీదుగా వెళ్లే అవసరం లేకుండా 90 కి.మీ మేర దూరం తగ్గుతుంది. ఇది ఇరు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పర్యాటకాన్ని కూడా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. కల్వకుర్తి నుంచి ప్రారంభమయ్యే 167 కె నంబర్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు, కొల్లాపూర్ సోమశిల, ఏపీలోని ఆత్మకూరు మీదుగా నంద్యాల వరకు ఈ హైవేను నిర్మిస్తారు. ఈ హైవే నిర్మాణంతో హైదరాబాద్- బెంగళూరు (ఎన్.హెచ్-44) పై భారం కూడా తగ్గనుంది.






