- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసీసీ చారిత్రాత్మక నిర్ణయం.. మహీళా క్రికెటర్లకు 6 ప్రత్యేక గైడ్‌లైన్స్ విడుదల
ప్రసవాంతరం మహిళా క్రికెటర్లు మళ్లీ మైదానంలోకి వచ్చేందుకు ఐసీసీ చారిత్రాత్మక గైడ్‌లైన్స్.. మాతృత్వం, కెరీర్ మధ్య ఇక రాజీ పడనక్కర్లేదన్న జై షా!

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ఐసీసీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో సరికొత్త మైలురాయి నమోదైంది. క్రీడాకారిణులు తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే మాతృత్వాన్ని ఆస్వాదించేలా, ప్రసవం తర్వాత మళ్లీ సురక్షితంగా మైదానంలోకి అడుగుపెట్టేలా (Post-Pregnancy Return to Play) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చారిత్రాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. మహిళా క్రికెట్ వేగంగా ప్రొఫెషనల్‌గా మారుతున్న తరుణంలో, చాలా మంది ఆటగాళ్లు తమ కెరీర్ మధ్యలోనే కుటుంబ జీవితాన్ని ప్రారంభించేందుకు మొగ్గు చూపుతుండటాన్ని పరిగణనలోకి తీసుకుని ఐసీసీ ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.
ప్రసవం తర్వాత మహిళా క్రికెటర్లు శారీరకంగా, మానసికంగా కోలుకుని స్థిరమైన ప్రదర్శన చేసేందుకు ఐసీసీ ఒక 16 వారాల (16-week window) ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఈ రోడ్‌మ్యాప్ ప్రధానంగా రెడీ (Ready), రివ్యూ (Review), రిస్టోర్ (Restore), రీకండిషన్ (Recondition), రిటర్న్ (Return), రిఫైన్ (Refine) అనే ఆరు సూత్రాల (6 Rs) ఆధారంగా పనిచేస్తుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ప్రసవం తర్వాత మైదానంలోకి తిరిగి వచ్చే ప్రతి క్రీడాకారిణి భద్రత, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం కోసం సంబంధిత క్రికెట్ బోర్డులు ఒక ప్రత్యేక 'కేస్ మేనేజర్' (Case Manager) ను నియమించాల్సి ఉంటుంది. ఈ మేనేజర్ కచ్చితంగా ఒక వైద్య నిపుణుడు, ఫిజియోథెరపిస్ట్ అయి ఉండాలి.
ప్రసవం జరిగిన తొలి వారం నుండి 16 వారాల పాటు క్రీడాకారిణుల మానసిక ఆరోగ్యానికి కౌన్సిలింగ్ ఇవ్వడం, శారీరక సామర్థ్యాన్ని బట్టి రన్నింగ్, నెట్ ప్రాక్టీస్ షెడ్యూల్స్ ఖరారు చేయడం వీరి బాధ్యత. అంతేకాకుండా స్టేడియంల వద్ద శిశువుల సంరక్షణకు ప్రత్యేక వసతులు (Childcare spaces), ఫీడింగ్ రూములు, ప్రయాణాల సమయంలో అవసరమైన మద్దతును బోర్డులు కల్పించాల్సి ఉంటుంది. ఏ మహిళా క్రికెటర్ కూడా మాతృత్వం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం అనే రెండు అంశాల మధ్య ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సిన దుస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది.






