- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
iBOMMA రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత
ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మది రవి(iBOMMA Ravi)కి షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మది రవి(iBOMMA Ravi)కి షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని.. బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం రవి దాఖలు చేసిన ఐదు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఇదిలా ఉంటే.. ఐబొమ్మ రవి పైరసీ కేసులో ఇటీవల సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ సినిమాల ద్వారా రవి రూ. 13.40 కోట్లు ఆర్జించినట్లు తెలిసింది. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు అందులో రూ.90 లక్షలు తన సోదరికి పంపినట్లు పోలీసులు గుర్తించారు.
Next Story






