- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల కోసం కష్టపడి పని చేస్తా.. పొలిటికల్ ఫ్యాన్స్‌ను పెంచుకుంటా: ఎమ్మెల్సీ అజారుద్దీన్
మండలిలో అజారుద్దీన్, కోదండరామ్ హంగామా! ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన ఇద్దరు నేతలు. "క్రికెట్ ఫ్యాన్స్ కంటే పొలిటికల్ ఫ్యాన్స్ సంపాదించుకుంటా" అని అజారుద్దీన్ ధీమా.

దిశ, వెబ్ డెస్క్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదం, ప్రభుత్వ జీవో అనంతరం ఈ రోజు ఉదయం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ప్రొఫెసర్ కోదండరామ్, మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరై నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మండలిలో అడుగుపెట్టిన ఈ ఇద్దరు దిగ్గజాలు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
రాజకీయాల్లోనూ సిక్సర్లు కొడతా..
ప్రమాణ స్వీకారం అనంతరం అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతానికి నాకు పొలిటికల్ ఫ్యాన్స్ కంటే క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువే ఉండొచ్చు. కానీ, ఇకపై ప్రజల కోసం కష్టపడి పనిచేసి రాజకీయ అభిమానులను కూడా సంపాదించుకుంటాను" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్సీగా, మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధిష్ఠానానికి, సహచర మంత్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒక ఆటగాడిగా దేశానికి ఎలాగైతే సేవ చేశానో, అలాగే ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మీడియాతో చెప్పుకొచ్చారు.






