- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అద్భుతమైన సేవ.. నిబద్ధతకు నేను వారిని గౌరవిస్తున్నాను’: Pawan Kalyan
20వ NDRF వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: ప్రకృతి వైపరీత్యాలు, మానవ చర్యల ఫలితంగా కొన్ని సందర్భాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతుంటాయి. భారత్‌లోనూ అనేక ప్రాంతాలు విపత్తులను ఎదుర్కొంటున్నాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు సహాయ సహకారం అందించడానికి ఏర్పాటైన ప్రత్యేక దళమే ‘నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF)’. విపత్తులను నిర్వహించడంలోనూ.. విపత్తు ప్రమాద తగ్గింపు గురించి అవగాహన కల్పించడంలో NDRF కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రతి ఏటా జనవరి 19వ తేదీన ఎన్‌డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ తరుణంలో 20వ NDRF వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ‘‘ప్రకృతి, మానవ నిర్మిత విపత్తుల సమయంలో ప్రాణాలను కాపాడటంలో NDRF సిబ్బంది చూపిన అద్భుతమైన సేవ, వేగవంతమైన ప్రతిస్పందన మరియు నిబద్ధతకు నేను వారిని గౌరవిస్తున్నాను. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి త్యాగం మరియు వృత్తి నైపుణ్యం దేశానికి గర్వకారణం’’ అంటూ పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.






