Keerthi Bhat: పేర్లు రాసిపెట్టుకున్నా.. నాకు ఏదైనా జరిగితే బాధ్యులు వాళ్లే.. నటి సంచలన పోస్ట్

by Mallepaka Hamsa |

బుల్లితెర నటి, బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భట్(Keerthi Bhat), తన ప్రియుడు కార్తీక్‌(Karthik)తో విడిపోయిన విషయం గత రెండు రోజులుగా సోషల్ మీడియా హాట్ టాపిక్‌గా మారింది.

Keerthi Bhat: పేర్లు రాసిపెట్టుకున్నా.. నాకు ఏదైనా జరిగితే బాధ్యులు వాళ్లే.. నటి సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: బుల్లితెర నటి, బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భట్(Keerthi Bhat), తన ప్రియుడు కార్తీక్‌(Karthik)తో విడిపోయిన విషయం గత రెండు రోజులుగా సోషల్ మీడియా హాట్ టాపిక్‌గా మారింది. 2023లో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ.. పెళ్లి చేసుకోకుండానే పలు షోలకు హాజరయ్యారు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఊహించని విధంగా విడిపోయి.. సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక ఈ విషయం తెలియడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. దీంతో కార్తీక్ స్పందించి.. తనకు విడిపోవాలని లేదని తాను ఆర్థికంగా స్థిరపడలేదనే కారణం ఆమెకు నచ్చలేదని చెప్పాడు. అంతేకాకుండా కీర్తి డబ్బున్న వ్యక్తిని చూసుకొని నన్ను వదిలేసిందని.. ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. దీంతో నెటిజన్లు కీర్తిని ట్రోల్ చేయడం మొదలెట్టారు. తల్లివి కాలేకపోయినా.. కార్తీక్ కుటుంబం నిన్ను కోడలిగా అంగీకరించారు అలాంటి వారిని ఎలా మోసం చేశావని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, కీర్తి భట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.

తన ప్రియుడు చెప్పిన మాటలను కరెక్ట్ అనుకుని తనను దారుణంగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనను దూషించేవారు.. తన గత పోస్ట్ చూస్తే.. అందులో ఎక్కడా అవతలివారి బలహీనతల్ని, వ్యక్తిగత విషయాలు ప్రస్తావించలేదని చెప్పింది. అయినప్పటికీ తనపై కొన్ని యూట్యూబ్ చానళ్లు, ఇన్‌స్టాగ్రామ్ పేజీలు లేనిపోని కథలు అల్లుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అది తనను మనోవేదనకు గురి చేస్తోందని.. ఆ బాధను తట్టుకోలేకపోతున్నా అని పేర్కొంది. ఎవరైతే తనపై నిందలు వేస్తూ.. కించపరుస్తూ మాట్లాడుతున్నారో వారి పేర్లను రాసిపెట్టుకున్నా అని తనకు ఏదైనా జరిగితే మాత్రం బాధ్యులు వాళ్లే అవుతారని హెచ్చరించింది. ‘‘దయచేసి నాపై తప్పుడు వార్తలు సృష్టించకండి. నన్ను అర్థం చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా కామెంట్స్ బాక్స్ ఆఫ్ చేసింది.

Next Story