- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లొద్దు కానీ నలుగురు పిల్లలు కావాలంటూ ప్రభాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
నిధి అగర్వాల్(Nidhi Agarwal)కు గత కొద్ది కాలంగా అదృష్టం కలిసి రావడం లేదు.

దిశ, సినిమా: నిధి అగర్వాల్(Nidhi Agarwal)కు గత కొద్ది కాలంగా అదృష్టం కలిసి రావడం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చినప్పటికీ హిట్ మాత్రం కావడం లేదు. గత ఏడాది నిధి, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన నటించిన ‘హరి హర వీరమల్లు’ ఆశించిన విజయాన్ని అందించకపోగా, ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన ప్రభాస్ ‘ది రాజాసాబ్’ (The Rajasab)బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించిన నిధి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
పిల్లల పట్ల తనకున్న అమితమైన ప్రేమ గురించి నిధి మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటి నుంచే పిల్లలంటే చాలా ఇష్టమని తెలిపారు. తను పుట్టిన ఏడేళ్ల తర్వాత చెల్లి పుట్టాలని దేవుడికి ఉత్తరాలు కూడా రాసేదానినని, అలా పుట్టిన తన సోదరిని ఒక కూతురిలాగే చూసుకుంటానని ఎమోషనల్ అయ్యింది. తన జీవితంలో పెళ్లికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, తనకు నలుగురు పిల్లలు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. పిల్లల గురించి తాను నిరంతరం ఆలోచిస్తుంటానని, వారిని పెంచడమంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇదే క్రమంలో దత్తత గురించి నిధి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితా సేన్ లాగే తాను కూడా పెళ్లికి ముందే పిల్లలను దత్తత తీసుకోవాలని అనుకున్నట్లు నిధి వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్స్, వృత్తిపరమైన బాధ్యతల వల్ల అది సాధ్యం కాదని, కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా నలుగురు పిల్లలను దత్తత తీసుకుంటానని ఆమె స్పష్టం చేసింది. ఒక స్టార్ హీరోయిన్ ఇలా పిల్లల దత్తతపై బహిరంగంగా మనసులో మాట చెప్పడంతో సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
Read More..






