అనిల్ రావిపూడి ఎవరో తెలియదు.. నటి సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

వరుస విజయాలతో తిరుగులేని కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) పేరు తెలియని వారుండరు.

అనిల్ రావిపూడి ఎవరో తెలియదు.. నటి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: వరుస విజయాలతో తిరుగులేని కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) పేరు తెలియని వారుండరు. ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలవడంతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ప్రతి ఏడాది ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ అద్భుతమైన విజయాలు అందుకుంటున్నాడు. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో వచ్చిన అనిల్ రావిపూడి బాక్సాఫీసును షేక్ చేశారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా.. వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ కూడా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రతి సంక్రాంతికి ఓ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇస్తూ.. ఫుల్ పాపులారిటీ దక్కించుకుంటున్నాడు. అలాంటి అనిల్ రావిపూడి అంటే ఎవరో తెలియదు అని టాలీవుడ్ హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

అసలు విషయంలోకి వెళితే.. అనిల్ రావిపూడి ఎవరో తెలియదని చెప్పిన హీరోయిన్ మరెవరో కాదు.. ఆయన డైరెక్షన్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh). ఈ అమ్మడుకి ఇందులో అవకాశం ఇచ్చేవరకు ఆయన ఎవరో తెలియదు చెప్పడం గమనార్హం. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘సంక్రాంతికి వస్తున్నాం రాకముందు ఓ ఏడాది వరకు నాకు అవకాశాలు రాలేదు. ఆ సమయంలోనే అనిల్ రావిపూడిగారు ఫోన్ చేశారు. ఆడిషన్ చేయాలి సినిమా కోసం అన్నారు. ఆరోజు ఆయన ఫోన్ చేసే వరకు అనిల్ రావిపూడి ఎవరో తెలియదు. కాల్ కట్ అయ్యాక ఆయన పేరు గూగుల్ సెర్చ్ చేశాను. ఆ తర్వాత అడిషన్‌కు వెళ్లాను.

అక్కడ నాతో రెండు మూడు డైలాగులు చెప్పించడంతో పాటుగా.. మేకప్ కూడా వేశారు. నేను స్క్రిప్ట్ కూడా చదివిన తర్వాత ఆ పాత్రకు నేను అవ్వను అని అనిల్ రావిపూడితో చెప్పాను. సీరియస్ పాత్రలు చేసే నేను కామెడీ క్యారెక్టర్ చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాను. కానీ అనిల్ రావిపూడి గారు మీకెందుకు నేను ఉన్నానుగా అని భరోసా ఇచ్చారు. అందుకే ఈ అవకాశం ఒప్పుకున్నాను’’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story