- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా సినిమాల్లో బోల్డ్ సీన్లకు చోటివ్వను.. బాలీవుడ్ హీరో
by Javid Pasha |
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తన సినిమాల్లో రొమాంటిక్ సీన్లు, పాటలు పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.. Latest Telugu News..

X
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తన సినిమాల్లో రొమాంటిక్ సీన్లు, పాటలు పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించిన జాన్.. దర్శకనిర్మాతలు 'ఐటెం సాంగ్' లేదా 'బోల్డ్ సీన్లలో నటించాలని చెప్పగానే చెమటలు పడతాయని, భయంతో పారిపోవాలనిపిస్తుందని తెలిపాడు. అయితే, ఆ సీన్లలో నటించకపోవడంపై ఎవరేం అనుకున్నా తనను తాను గొప్పవాడిగా ఫీల్ అవ్వడం లేదని, ఐటెం సాంగ్స్ అనగానే మానసికంగా కృంగిపోతానని చెప్పాడు. ఈ క్రమంలోనే తన సినిమాల్లో కొన్ని అద్భుతమైన పాటలు అభిమానులను అలరించాయన్న ఆయన.. కొన్ని దారుణమైన పాటలు ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు పేర్కొన్నాడు. ఇక కథతో సంబంధం లేకుండా వచ్చే పాటలు సినిమాలకు పబ్లిసిటీ తెచ్చిపెట్టినప్పటికీ తనకు మాత్రం అస్సలు నచ్చవని ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు జాన్.
Next Story






