Medaram: వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న హైడ్రా చీఫ్

by Gantepaka Srikanth |

ములుగు జిల్లా మేడారం మ‌హాజాత‌ర‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ కుటుంబ స‌మేతంగా వెళ్లారు.

Medaram: వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న హైడ్రా చీఫ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ములుగు జిల్లా మేడారం మ‌హాజాత‌ర‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ కుటుంబ స‌మేతంగా వెళ్లారు. సమ్మక్క - సారలమ్మ వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకుని మొక్కులు సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవతలను ప్రార్థించారు. మేడారం జాతర విశిష్టతను గుర్తుచేస్తూ, ఈ పవిత్ర ఉత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. మేడారం జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తూ.. ప్రజల మధ్య ఐక్యతను చాటిచెబుతుంద‌న్నారు. మరోవైపు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈసారి సరికొత్త శోభను సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో భక్తుల కోసం ఎన్నడూ లేని విధంగా భారీ ఏర్పాట్లు చేశారు. పారిశుధ్యం నుంచి భద్రత వరకు ప్రతి అంశంలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు జాతరకు వచ్చే భక్తులకు గొప్ప అనుభూతిని మిగిల్చాయి.

Next Story